Polimera 2 Review : చేతబడి కాన్సెప్ట్ మీద ఇది వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. అదే చేతబడి కాన్సెప్ట్ మీద అతి తక్కువ బడ్జెట్ తో సత్యం రాజేష్ , బాలాదిత్య మరియు గెటప్ శ్రీను ని ప్రధాన పాత్రల్లో పెట్టి తీసిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రం నేరుగా ఓటీటీ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. మంచి థ్రిల్లింగ్ సబ్జెక్టు ని అనవసరంగా ఓటీటీ కి ఇచ్చేసారు, థియేటర్స్ లో అనుభూతి చెందాల్సిన చిత్రమిది అని చూసిన ప్రతీ ఒక్కరికి అనిపించిన ఫీలింగ్. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు పొలిమేర 2 నేడు గ్రాండ్ గా విడుదల అయ్యింది. మొదటి భాగం లాగానే, రెండవ భాగం కూడా ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేసిందా?, అంచనాలను అందుకుండా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాం.

కథ :
5 నెలల గర్భవతి అయిన కవిత ( రమ్య) ని చేతబడి చేసి హత్య చేసాడనే అనుమానం తో కొమురయ్య(సత్యం రాజేష్) ని అనుమానించి కవిత అన్నయ్యలు చంపేస్తారు. కానీ ఈ హత్య వెనుక ఎదో మిస్టరీ దాగుంది అని అనుమానించిన కొమురయ్య సోదరుడు కానిస్టేబుల్ జంగయ్య (బాలాదిత్య) విచారణ చేపట్టగా, కొమురయ్య నిజంగానే కవితని చాతబడి చేసి చంపాడని, ఊర్లో చాటబడి ద్వారా అలా చాలా మంది ప్రాణాలను తీసాడనే విషయాన్నీ కనుక్కుంటాడు. అంతే కాదు కొమురయ్య చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అనే విషయాన్నీ కూడా కనిపెడుతాడు. కట్ చేస్తే కొమురయ్య తో పాటుగా కవిత కూడా బ్రతికే ఉంటుంది. ఇద్దరు కలిసి కేరళలో ఒక టీ కొట్టులో పని చేస్తూ ఉంటారు. కొమురయ్య బ్రతికే ఉన్నాడు అనే విషయం తెలుసుకొని అతన్ని వెతుక్కుంటూ వచ్చిన సోదరులకు కొమురయ్య తో పాటుగా కవిత కూడా బ్రతికే ఉందనే విషయం తెలుసుకొని షాక్ కి గురి అవుతారు. అసలు ఎందుకు కొమురయ్య చాతబడి ద్వారా హత్యలు చేస్తున్నాడు?, అందుకు కారణం ఏమిటి?, ఇంతకీ కొమురయ్య మంచి కోసమే ఇదంతా చేస్తున్నాడా?, లేదా చెడు కోసం పని చేస్తున్నాడా?, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే థియేటర్స్ కి కదలాల్సిందే.

విశ్లేషణ :
పార్ట్ 1 లో వచ్చిన ట్విస్టులు కేవలం శాంపిల్ మాత్రమే, కానీ ఈ చిత్రం లో ఉన్న ట్విస్టులు అన్నీ ఇన్ని కావు. ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుంది. ఎదో ట్విస్టు లు పెట్టాం అంటే పెట్టాం అన్నట్టు కాకుండా, కథ కి లింక్ చేస్తూ, డైరెక్టర్ తీసిన విధానం అద్భుతం అనే చెప్పాలి. మూవీ ప్రొమోషన్స్ లో సత్యం రాజేష్ చెప్పినట్టుగా, ఇది కేవలం ఒకటి రెండు భాగాలతో పూర్తయ్యే సినిమా కాదు, ఆరు చాఫ్టర్లు ఉన్నాయి అని అంటాడు. సినిమా కథ లో నిజంగానే అంత డెప్త్ ఉంది అని చూసే ప్రతీ ప్రేక్షకుడికి అనిపిస్తుంది.

కథ, దర్శకత్వం , స్క్రీన్ ప్లే, నటీనటుల అద్భుతమైన నటన ఇలా ప్రతీ ఒక్కటి పర్ఫెక్ట్ గా కుదిరినప్పటికీ ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగా చీప్ గా అనిపించడం ఈ సినిమాలో ఉన్న ఏకైక నెగటివ్ పాయింట్. చాలా పెద్ద కథ, పెద్ద స్కేల్ లో, భారీ గ్రాఫిక్స్ మరియు క్వాలిటీ కెమెరా తో సినిమాని తియ్యొచ్చు కదా అనే అనుభూతి చూసే ఆడియన్స్ కి కలుగుతుంది. పార్ట్ 2 పెద్ద హిట్ అయితే పార్ట్ 3 నుండి పెద్ద నిర్మాణ సంస్థలు ఈ పొలిమేర సిరీస్ కి పెట్టుబడులు పెట్టొచ్చు. ఇక కొమురయ్య పాత్రలో సత్యం రాజేష్ నటించలేదు, జీవించాడు అనే చెప్పాలి. ఆయన పాత్ర ఇచ్చే ట్విస్టులు ఈ సినిమాలో అన్నీ ఇన్నీ కావు. మిగిలిన పాత్రధారులు కూడా కథని రక్తి కట్టించేవిధంగా అద్భుతంగా నటించారు.
చివరి మాట :

థ్రిల్లర్ జానర్ చిత్రాలను నచ్చే ఆడియన్స్ కి మాత్రమే కాదు, ప్రతీ మూవీ లవర్ కి ఈ చిత్రం తెగ నచ్చేస్తుంది. థియేటర్స్ లో కచ్చితంగా మిస్ కాకూడదు అనిపించే చిత్రమిది. ఈ సినిమాని చూసే ముందు ‘మా ఊరి పొలిమేర’ చిత్రాన్ని చూసి థియేటర్స్ కి వెళ్ళింది. అప్పుడే ఈ సినిమా అందరికీ అర్థం అవుతుంది. ఈ చిత్రం యూట్యూబ్ మరియు డిస్నీ + హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
నటీనటులు : తరుణ్ భాస్కర్, చైతన్య రావు, బ్రహ్మానందం, రాజ్ మయూర్, జీవన్ కుమార్, విష్ణు తదితరులు
రచన, దర్శకత్వం : తరుణ్ భాస్కర్
నిర్మాత : దగ్గుపాటి రానా
సంగీతం : వివేక్ సాగర్
రేటింగ్ : 3/5