టాలివుడ్ స్టార్ హీరో.. గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వస్తున్నాడు.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈ సినిమా తర్వాత పెరిగిందనే చెప్పాలి.. ఇక విషయానికొస్తే.. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకు కారణం ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతి కిరాతకంగా ప్రవరించారు.. ఫ్లెక్సీ లపై రక్తాభిషేకం చేశారు.. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు అరెస్ట్ చేశారు..

జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మేకలను బలి ఇచ్చినందుకు తొమ్మిది మందిపై రాబర్సన్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఫిల్మ్ థియేటర్‌లోని ఫ్లెక్సీ బ్యానర్‌లపై అభిమానులు రెండు మేకలను బలి ఇచ్చి వాటి రక్తాన్ని చిందించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వ్యక్తులను పి. శివ నాగరాజు, కె.సాయి, జి. సాయి, డి. నాగ భూషణం, వి. సాయి, పి. నాగేశ్వరరావు, వై. ధరణి, పి. శివ, బి. అనిల్ కుమార్‌లుగా గుర్తించారు..

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు.. కర్ణాటకలో రాబర్ట్ సన్ లోని ఓ థియేటర్ బయట ఉన్న ఎన్టీఆర్ ‘దేవర’ కటౌట్ కి ఫ్యాన్స్ రక్తాభిషేకం చేశారు. అంటే రెండు మేకల్ని అక్కడే చంపి వాటి రక్తాన్ని ఎన్టీఆర్ పోస్టర్ పై పూశారు. ఆ తర్వాత మేకల బాడీల్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి పోలీసుల దగ్గరికి చేరుకుంది. దీంతో దర్యాప్తు చేసి ఏకంగా తొమ్మిది మంది ఫ్యాన్స్ ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు అని నెటిజన్స్ సదరు ఫ్యాన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు.. ఈ వార్త వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల అవుతుంది.