Ram Charan – Dhoni : #RRR చిత్రం గ్రాండ్ సక్సెస్ తో రామ్ చరణ్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ దక్కిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్ అనే పేరు బలంగా వినిపించింది. ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది.

వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన బుచ్చి బాబు తో ఒక పీరియడ్ డ్రామా చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా కూడా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. వీటి తర్వాత సుకుమార్ తో ఒక సినిమా, బాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తో ఒక సినిమా ఓకే చేసాడు. ఈ ప్రాజెక్ట్స్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రామ్ చరణ్ ప్రముఖ ఇండియన్ క్రికెటర్, మన దేశానికీ మూడు వరల్డ్ కప్స్ ని తెచ్చి పెట్టిన మహేంద్ర సింగ్ ధోని ని కలిసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ధోని తో గతం లో రామ్ చరణ్ కలిసి పెప్సీ యాడ్ చేసాడు. మళ్ళీ ఇన్ని రోజులకు వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని తెలుస్తుంది. ధోని భార్య రీసెంట్ గానే ‘ధోని ఎంటర్టైన్మెంట్స్’ అనే సంస్థ ని ఏర్పాటు చేసి, సినిమాలు తియ్యడం ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సంస్థ నుండి ఇప్పటి వరకు ‘LGM’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు, దీంతో ధోని తీస్తే పెద్ద హీరోలతోనే సినిమాలు తియ్యమని తన భార్య కి సూచించాడట. అందులో భాగంగానే గతం లో తమిళ స్టార్ హీరో విజయ్ ని కలిసాడు, ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కలిసాడు. రామ్ చరణ్ ని పెట్టి ఒక్క భారీ బడ్జెట్ పీరియడ్ డ్రామా ని నిర్మించడానికి ధోని సన్నాహాలు చేస్తున్నాడు అట, ఈ చిత్రం 30 భాషల్లో విడుదల కాబోతుందని టాక్. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.