Payal Rajput : ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకొని తన సత్తా చాటిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో ఆమెని చాలా బోల్డ్ గా, నెగటివ్ రోల్ లో చూపించాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమా ప్రభావం వల్లనో ఏమో తెలీదు కానీ, ఆమెకి మొన్నటి వరకు కెరీర్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.
ఇప్పుడు మళ్లీ అజయ్ భూపతి తో ఆమె చేసిన ‘మంగళవారం’ చిత్రం రీసెంట్ గానే గ్రాండ్ గా విడుదలై ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. అన్నిటికి మించి పాయల్ రాజ్ పుత్ నటనకి ఆడియన్స్ నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా ఆమె కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు.
రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించి ఒక సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ సక్సెస్ మీట్ లో పాయల్ రాజ్ పుత్ ఎమోషనల్ టచ్ తో బోల్డ్ గా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నేను ఈ సినిమాలో బోల్డ్ పాత్ర ని పోషించాను. కానీ సోషల్ మీడియా లో వస్తున్న కొన్ని కామెంట్స్ నా మనసుని బాధించాయి. ప్రతీ ఒక్కరూ నా శరీరం పైనే కామెంట్ చేస్తున్నారు. మీరు సినిమాని సినిమాలాగే చూడండి. ఈ చిత్రం లో నేను బోల్డ్ గా నటించినంత మాత్రాన అది నా క్యారక్టర్ కాదు. ఈ సినిమా లో డైరెక్టర్ గారు నన్ను బోల్డ్ గా చూపించినప్పటికీ నా పాత్ర పై కలిగించేలా చేసాడు’ అంటూ చెప్పుకొచ్చింది పాయల్ రాజ్ పుత్.