Balakrishna : బాలీవుడ్ వాళ్లంతా బాలకృష్ణను చూసి సిగ్గు తెచ్చుకోవాలి.. స్టార్ హీరోయిన్ వైరల్ కామెంట్స్..

- Advertisement -

Balakrishna : ప్రయాణం, ఊసరవెల్లి వంటి సినిమాలలో నటించిన ఈ బెంగాలీ భామ పాయల్ ఘోష్.. చాలా కాలం క్రితమే టాలీవుడ్ కు దూరమైంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వీలుచిక్కినప్పుడల్లా బాలీవుడ్ పై విరుచుకుపడే పాయల్.. లేటెస్టుగా మరోసారి హిందీ నటులను టార్గెట్ చేసింది. ఈసారి సీనియర్ హీరో బాలకృష్ణను పొగుడుతూ, బాలీవుడ్ యాక్టర్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

Balakrishna
Balakrishna

‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. 63 ఏళ్ల వయసులోనూ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తూ, నేటి తరం నటీనటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని పాయల్ ఘోష్ తన తాజా ట్వీట్ లో ప్రస్తావిస్తూ, బాలీవుడ్ యాక్టర్స్ అందరూ బాలయ్యని చూసి నేర్చుకోవాలని సూచించింది. ఇంతకీ అమ్మడు ఏమన్నదంటే..

“బాలకృష్ణ సార్ ఈ ఏజ్ లో కూడా సూపర్ హిట్స్ కొడుతున్నారు… బాలీవుడ్ నటీనటులు ఆయన నుండి ఎంతో నేర్చుకోవాలి” అని పాయల్ ఘోష్ శనివారం సంచలన ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా బాలయ్యతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఓవైపు బాలయ్యని పొగుడుతూనే, మరోవైపు పనిలో పనిగా హిందీ యాక్టర్స్ పై సెటైర్లు వేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here