Bigg Boss 7 లోకి పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడు..టైటిల్ విన్నర్ ఈయనే అని ఫిక్స్ అవ్వొచ్చా..?

- Advertisement -

Bigg Boss 7 : కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ,సెప్టెంబర్ 3 వ తారీఖు నుండి గ్రాండ్ గా ప్రారంభం అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. గత సీజన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం తో ఈ సీజన్ తో కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి అనే రేంజ్ లో ప్లాన్ చేసారు.

Bigg Boss 7
Bigg Boss 7

అలాగే కంటెస్టెంట్స్ విషయం లో కూడా ఆచి తూచి అడుగులు వేసినట్టు తెలుస్తుంది. ఈ సీజన్ లో పాల్గొనే ప్రతీ కంటెస్టెంట్ కూడా కోట్లాది మంది తెలుగు ప్రజలకు బాగా సుపరిచితమైన వాళ్ళే అని తెలుస్తుంది. ఇప్పటికే పలువురి పేర్లు వినిపించినా, అవేమి అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. కానీ ఒక క్రేజీ హీరో అలాగే ఒక క్రేజీ హీరోయిన్ ఈ సీజన్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్లెవరో ఒకసారి చూద్దాం.

అప్పట్లో ‘ప్రేమ దేశం’ వంటి సినిమాతో యూత్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న అబ్బాస్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆరోజుల్లో యువత ఈయన హెయిర్ స్టైల్ ని ఒక రేంజ్ లో ఫాలో అయ్యేవాళ్ళు, సలోన్ షాప్ కి వెళ్తే అబ్బాస్ హెయిర్ స్టైల్ కొట్టమని అడిగేవారు, అంతటి ఫాలోయింగ్ ని సంపాదించాడు. ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మంచి మిత్రుడు కూడా.

- Advertisement -

అయితే కొన్నాళ్ళకు వరుస ఫ్లాప్స్ రావడం వల్ల సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గాయి. దీంతో ఫారిన్ వెళ్లి అక్కడ బిజినెస్ చేస్తూ కాలం గడిపేశాడు. ఈయనకి ఒక కూతురు కూడా ఉంది. అయితే ఈయనకి బిగ్ బాస్ యాజమాన్యం నుండి ఫోన్ కాల్ వచ్చిందని, త్వరలో ప్రసారం అవ్వబొయ్యే సీజన్ 7 లో అబ్బాస్ కూడా ఒక కంటెస్టెంట్ గా రాబోతున్నాడని తెలిసింది. ఈయనతో పాటు అల్లరి నరేష్ సినిమాల్లో హీరోయిన్ గా బాగా పాపులరైన ఫర్జానా కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొనబోతుందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here