Pawan Kalyan : ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలు అంటూ పవన్ కళ్యాణ్ క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. సరిగ్గా నాలుగు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ ఆపేసాడు. గత నెల ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ లో పాల్గొనేవాడు.

ఈ చిత్రం తో పాటుగా ‘ఓజీ’ మరియు ‘హరి హర వీరమల్లు’ చిత్రాలు కూడా సగం షూటింగ్స్ ని పూర్తి చేసుకున్నాయి. ఇవి ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశమే లేదు. డిసెంబర్ లో ఒక 15 రోజులు ‘ఓజీ’ చిత్రం కోసం డేట్స్ కేటాయించొచ్చు. అది కూడా ప్రస్తుతానికి డౌటే, కానీ మేకర్స్ బలంగా ప్రయత్నాలు చేస్తారు. వచ్చే ఏడాది మార్చి 22 వ తారీఖున ఓజీ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇంత కష్టమైన సమయం లో ఆయన మహేష్ బాబు సినిమా కోసం పని చేయబోతున్నాడట. అసలు విషయానికి వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో మహేష్ హీరో గా ‘గుంటూరు కారం’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ తో వాయిస్ ఓవర్ ఇప్పించబోతున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్.

గతం లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘జల్సా’ చిత్రానికి మహేష్ చేత వాయిస్ ఓవర్ ఇప్పించిన త్రివిక్రమ్, ఈసారి మహేష్ సినిమా కోసం పవన్ తో వాయిస్ ఓవర్ ఇప్పిస్తున్నట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్. పవన్ కళ్యాణ్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. తన సినిమాల కోసం డేట్స్ కేటాయించడానికి ఇంత ఇబ్బంది పడుతున్న పవన్, మహేష్ సినిమా కోసం అడగగానే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.