Big Boss : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్ చాలా తక్కువ మందితో మాత్రమే మాట్లాడడం వంటివి చేస్తుంటాడు అని అందరూ అంటూ ఉంటారు. బ్రేక్ సమయం లో ఎక్కువగా ఆయన పుస్తకాలను చదవడం వంటివి చేస్తూ ఉంటాడట. ఇది ఆయన తో కలిసి పని చేసిన ప్రతీ ఒక్కరు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైనా మూడ్ బాగున్న సమయం లో మాత్రం ఆయన మంచి సరదాగా ఉంటాడట. జోక్స్ మరియు ఫన్ చేస్తూ సెట్స్ మొత్తం సందడి చేస్తాడట.

ఆయనతో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి ప్రముఖ నటి మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ జ్యోతి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘నేను పవన్ కళ్యాణ్ కి పెద్ద వీరాభిమానిని, ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం, ఆయన ఎంతో గొప్ప వ్యక్తి’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఆమె చేసిన కొన్ని ఆసకికరమైన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

ఈమె పవన్ కళ్యాణ్ తో కలిసి ‘గుడుంబా శంకర్’ చిత్రం లో నటించింది. ఇందులో కమెడియన్ సునీల్ కి భార్య గా ఈమె కనిపిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో పవన్ కళ్యాణ్ చాలా సరదాగా ఉండేవాడట. అప్పట్లో జ్యోతి పేరు పై పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన కవితలు మరియు ప్రేమ లేఖలు రాసేవాడట. ప్రేమ లేఖలు రాయడం అంటే నిజంగా ఆమె మీద రాసినట్టు కాదు.

సినిమాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట అలా. కానీ ఎందుకో అవి ఎడిటింగ్ వర్క్ లో తొలగించాల్సి వచ్చిందని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో హీరో గా నటించడమే కాకుండా, స్క్రీన్ ప్లే రైటర్ మరియు ఫైట్స్/ సాంగ్స్ కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేసాడు. అందుకే సన్నివేశాలు రాసుకుంటూ జ్యోతి మీద కూడా పలు సన్నివేశాలు రాసాడట.
