Pawan Kalyan ఎవ్వరి ఊహలకు అందని చర్యలు చెయ్యడమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్..అందుకే ఆయనకీ అభిమానులు ఉండరు, భక్తులే ఉంటారు.రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఆయన, నాలుగు సినిమాలను ఒకేసారి షూటింగ్ చేస్తాడని ఎవ్వరైనా ఊహించారా..?, కానీ చేస్తున్నాడు,ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలలో అభిమానులలో మంచి అంచనాలను ఏర్పర్చుకున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు.
గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఇండస్ట్రీ లో ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అలాంటి మాస్ సినిమా కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరింది.ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల 27 వ తారీఖు నుండి ప్రారంభం కానుంది.ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియా ని ఊపేస్తోంది.
అదేమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించబోతుందట..ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ అనే చెప్పాలి.ఎందుకంటే శ్రీలీల వయస్సు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే.పవన్ కళ్యాణ్ వయస్సు 50 సంవత్సరాలు దాటింది.అంత కుర్ర హీరోయిన్ ని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టడం పై సోషల్ మీడియా లో ఫ్యాన్స్ నుండి కాస్త అసంతృప్తి వ్యక్తం అవుతుంది.కానీ ఆమె అయితేనే ఆ పాత్రకి న్యాయం చేయగలదని డైరెక్టర్ హరీష్ శంకర్ బలంగా నమ్ముతున్నాడట.ప్రస్తుతం శ్రీ లీల చేతిలో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి.
వాటిల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఒకటి.ఆ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడం చూస్తుంటే రాబొయ్యే రోజుల్లో శ్రీలీల దెబ్బకి ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లు సర్దేసుకుంటారని అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తో మాత్రమే కాకుండా కుర్ర హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ మోస్ట్ డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్ గా మారిపోయింది శ్రీ లీల.