Pawan Kalyan: కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఇటీవలే ఆయన సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేస్తున్న సినిమా షూటింగ్ ని పూర్తి చేసాడు.ఇక గత మూడు రోజుల నుండి ఆయన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ఈ చిత్రం తో పాటుగా త్వరలోనే ఆయన #OG మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.ఈ నెల 15 వ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్న రెగ్యులర్ షూటింగ్ మొదటి షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ హాజరు కానున్నాడు.ముంబై లో ఈ మూవీ షూటింగ్ జరగనుంది.ఇది ఇలా ఉండగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన హీరోయిన్స్ వివరాలు కూడా నేడే బయటకి వచ్చింది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో హీరోయిన్ గా శ్రీలీల నటించబోతుందని గత కొంతకాలం గా సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది, నేడు ఆ విషయాన్నీ మూవీ టీం ట్విట్టర్ ద్వారా అధికారికంగా ఖారారు చేసింది.ఇక #OG సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుందని సమాచారం.ఇలా వరుసగా కుర్ర హీరోయిన్స్ తో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా నిలిచాడు.

కేవలం ఈ రెండు సినిమాల్లో మాత్రమే కాదు, డైరెక్టర్ క్రిష్ తో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు‘ సినిమాలో కూడా నిధి అగర్వాల్ అనే కుర్ర హీరోయిన్ తో రొమాన్స్ చెయ్యబోతున్నాడు పవన్ కళ్యాణ్.ఇలా ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలన్నిట్లో కుర్ర హీరోయిన్స్ కి ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం చర్చనీయాంశం గా మారింది.
