పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ మూవీ లో నటించిన ఈ కమెడియన్ ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఎంతో ఎంజాయ్ చేసే మూవీ ‘తమ్ముడు’. తొలిప్రేమ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ఈ చిత్రం, తొలిప్రేమ ని మించి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీ లో వస్తే మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుంటాయి. ఆరోజుల్లోనే ఈ చిత్రం దాదాపుగా 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది అంటే షధారణమైన విషయం కాదు.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

ఇందులో పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూయించాడనే చెప్పాలి. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ మనల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఆవేశం రప్పిస్తాడు. ముఖ్యంగా ఈ చిత్రం లో ఆయన చేసిన ఫైట్స్, మరియు రోమాలు నిక్కపొడిచే రేంజ్ స్తంట్స్ చూస్తే పవన్ కళ్యాణ్ కి ఆరోజుల్లో సినిమా అంటే ఎంత కసి అనే విషయం అర్థం అవుతాది.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఉండే గ్యాంగ్ లో అలీ మరియు వేణు మాధవ్ తప్ప మరెవ్వరి పేరు కూడా తెలియదు. కానీ ఈ గ్యాంగ్ లో ఒకడు కళ్ళజోడు పెట్టుకొని, జ్యూమాంజి లాగ పిచ్చి జుట్టు వేసుకొని తింగరోడిలా ఒకడు ఉంటాడు గుర్తుందా. అమాయకుడిగా నటించిన ఇతని పేరు శివ. ఈయన ఈ చిత్ర దర్శకుడు పీ అరుణ్ ప్రసాద్ కి బాగా తెలిసిన వ్యక్తి. సరదాగా ఈ సినిమాలో ఒకసారి నటించి పొమ్మంటే నటించాడు.

- Advertisement -

కానీ ఇతను ఈ సినిమా తర్వాత మళ్ళీ ఎలాంటి సినిమాలో కూడా నటించలేదు. పై చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడ MS చదువు పూర్తి చేసి, ఇప్పుడు అక్కడి MNC కంపెనీ లో టీం మ్యానేజర్ గా కొనసాగాడు. ఇప్పుడు ఇతనికంటూ ప్రత్యేకంగా ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ఉందట. గత నాలుగేళ్ల నుండి ఈ కంపెనీ ని ఆయన దిగ్విజయం నడిపిస్తున్నాడట. ఇతని ప్రస్తుత ఫోటోలు సోషల్ మీడియా లేవు, గతం లో కమెడియన్ అలీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఇతని గురించి చెప్పుకొచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here