పవర్ స్టార్ Pawan Kalyan హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం బయటకి రాగా వాటికి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో 10 రోజుల క్రితమే ప్రారంభించగా అన్నీ చోట్ల రికార్డు స్థాయి బుకింగ్స్ నమోదు అవుతున్నాయి.
ఇక ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన బుకింగ్స్ కూడా తెల్లవారుజామున ప్రారంభం అయ్యాయి. ఒక్కో గంటకు 5 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నట్టుగా బుక్ మై షో యాప్ లో తెలుస్తుంది. ఇదే జోరుని కొనసాగిస్తే ఈ చిత్రం హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ నుండే 8 కోట్ల రూపాయిల గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు. మరి మొదటి రోజు పూర్తి అయ్యే సమయానికి ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందో చూడాలి.
వదిన గురించి పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ :
ఇక పోతే నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళావేదిక లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘సినిమాల్లోకి రావాలని నాకు ఏమాత్రం లేదని, ఎదో చిన్న పని చేసుకుంటూ పొలం పనులు కూడా చేసుకోవాలని కోరుకున్నాను. రాజకీయాల్లోకి వస్తానని కూడా ఎప్పుడూ అనుకోలేదు, మా వదిన వల్లే నేను ఈరోజు సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. కచ్చితంగా ఈ ద్రోహం బాధ్యత మా వదినదే’ అంటూ పవన్ కళ్యాణ్ సరదాగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
తమిళ సినిమా ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు :
ఇది ఇలా ఉండగా తమిళ సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘తమిళ సినిమా ఇండస్ట్రీ లో కేవలం తమిళ ఆర్టిస్టులు మాత్రమే పని చెయ్యాలని ఈమధ్య రూల్ పెట్టినట్టు నా దృష్టికి వచ్చింది. దయచేసి ఆలా చెయ్యకండి. మా ఇండస్ట్రీ అన్నీ భాషలకు సంబంధించిన వాళ్ళను వెల్కమ్ చేస్తుంది. అలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తేనే మీరు కూడా #RRR లాంటి సినిమాలను తియ్యగలరు’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.