Pawan Kalyan ప్రముఖ నటుడు/దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ హీరోలు గా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన వినోదయ్యా సీతం రీమేక్ రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం కేవలం 22 రోజుల కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చాడు.ఈ 22 రోజుల కోసం ఆయన 44 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రధాన భాగం షూటింగ్ పూర్తి అయ్యింది.ఈ నెల 22 వ తారీఖున చిత్రం లో ఆయన పాత్ర కి సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తి అవుతుంది.అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 23 వ తారీఖున ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని విడుదల చేస్తారని అంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఎడిటింగ్ రూమ్ లోని ఈ చిత్రం లో ఒక్క సన్నివేశానికి సంబంధించిన షాట్స్ సోషల్ మీడియా లో లీక్ అయ్యి వైరల్ గా మారిపోయింది.సాయి ధరమ్ తేజ్ తో పాటుగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఆ షాట్ లో పవర్ స్టార్ స్టైలిష్ లుక్స్ ని చూసి ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోతున్నారు.కచ్చితంగా ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని తిరగరాస్తుంది అనే నమ్మకం అందరిలో కలిగింది.ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.
అంతే కాదు ఈ సినిమాకి సంబంధించి ఆయన సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో పాటుగా నిర్మాణ రంగం లో పాలు పంచుకుంటున్నాడు.ఇటీవలే ఆయన నిర్మాతగా ధనుష్ ని పెట్టి సార్ అనే సూపర్ హిట్ సినిమాని తీసాడు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో తియ్యబోయ్యే సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్.