Anjali Lavania : అందం తో పాటు అభినయం కూడా ఉన్న ఎంతో మంది హీరోయిన్లు కేవలం ఒకే ఒక్క సినిమాకి మాత్రమే పరిమితమైన సందర్భాలు గతం లో టాలీవుడ్ మనం ఎన్నో చూసాము.అప్పుడప్పుడు వాళ్ళని టీవీ లో చూసినప్పుడు అసలు ఈ అమ్మాయి ఏమైపోయింది, మళ్ళీ సినిమాల్లోకి రాలేదే అని అనుకుంటూ ఉంటాము, అలా ఒకేఒక్క సినిమాతో తళుక్కుమని మెరిసి మాయమైపోయింది హీరోయిన్స్ లో ఒకరు అంజలి లావానియా.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ భారీ హైప్ తో వచ్చిన ‘పంజా’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఈమె అప్పట్లో మంచి క్రేజ్ దక్కించుకుంది.కానీ ఈ చిత్రమే ఆమె చివరి చిత్రం అవుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.బహుశా పంజా సినిమా హిట్ అయ్యి ఉంటే ఈమె కెరీర్ బాగుండేది ఏమో.

అయితే అంజలి లావానియా బ్యాక్ గ్రౌండ్ ని ఒక్కసారి పరిశీలిస్తే ఈమె ప్రముఖ మిస్ కొచ్చిన్ కి కూతురు గా మోడలింగ్ రంగం లోకి అడుగుపెట్టింది.ఆమె తండ్రి ఇండియన్ నేవీ లో నావెల్ ఏవియేటర్ గా పని చేసేవాడు.మోడలింగ్ రంగం లో ఈమె ముంబై లోని శీతల్ డిజైన్ స్టూడియో లో పనిచేసింది.అంతే కాదు ఈమెకి పర్యావరణం మీద ఉన్న మక్కువ మామూలుది కాదు.దాని కోసం ఈమె చేస్తున్న ఎకో గ్రీన్ రెవల్యూషన్ ని గుర్తించి లాస్ ఏజిల్స్ టైమ్స్ మ్యాగజైన్ లో ప్రత్యేకంగా ఈమె పై ఆర్టికల్స్ వేశారు.ఇక మోడల్ రంగం లో ఈమె అమిర్ ఖాన్ , షారుఖ్ ఖాన్ మరియు ఇమ్రాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలకు కూడా కాస్ట్యూమ్స్ డిజైన్స్ చేసేది.అలా మోడలింగ్ రంగం లో దూసుకుపోతున్న అంజలి ని ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ గుర్తించి ఆయన తియ్యబోతున్న పవన్ కళ్యాణ్ ‘పంజా’ సినిమాలో ఆఫర్ ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ సినిమాలో ‘జాహ్నవి’ పాత్రలో ఆమె ఎంత మంచిగా నటించిందో అందరికీ తెలిసిందే, కానీ ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆమె ఎందుకు వేరే సినిమాలలో నటించలేదో ఇప్పటికీ అర్థం కానీ ప్రశ్న.అయితే పంజా సినిమా తర్వాత కూడా ఆమె ఎక్కువగా మోడలింగ్ రంగం పైనే ద్రుష్టి సారించింది.2012 వ సంవత్సరం కి గాను ప్రఖ్యాత ‘వాగ్’ సమస్త విడుదల చేసిన టాప్ 10 ఫిమేల్ మోడల్స్ లిస్ట్ లో అంజలి లావానియా కూడా ఉండడం విశేషం.ఆ తర్వాత కొనేళ్లకు ఆమె మోడలింగ్ రంగానికి కూడా గుడ్ బై చెప్పేసి ‘చక్ర హీలింగ్’ లో కొన్ని హీలింగ్స్ ఆర్ట్స్ ని నేర్చుకొని ‘చక్ర హీలర్’ గా సర్టిఫికెట్ కూడా పొందింది.ఇది ఇలా ఉండగా చాలా కాలం తర్వాత ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా ని తెగ ఊపేస్తున్నాయి.ఆ ఫోటోలను మీరు కూడా చూడండి.