మాఫియా బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాల తీస్తే అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘జైలర్’ చిత్రం టాప్ స్థానం లో ఉంటుంది. ఈ చిత్రం అప్పట్లో సౌత్ లో సృష్టించిన సునామి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. అప్పటి వరకు కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితమైన రజినీకాంత్ మార్కెట్ , ఈ చిత్రం తో పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళింది. ఏ హీరో అయినా మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమా తీస్తే బాషా చిత్రం తో పోల్చుకుంటారు.

అయితే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ఓజీ చిత్రం కూడా ఆయన కెరీర్ లో అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రం లో కేజీఎఫ్ కి మించిన ఎలివేషన్ సన్నివేశాలు ఉంటాయట. వాటితో పాటుగా గుండెల్ని పిండేసే రేంజ్ ఎమోషన్స్ కూడా ఉంటాయని టాక్.

గ్యాంగ్ స్టర్ సినిమాల్లో ఎలివేషన్స్ కి తోడు ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా కుదిరితే బాక్స్ ఆఫీస్ ఫలితాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది. ఓజీ చిత్రం కూడా అలాగే ఉంటుందట. రీసెంట్ గా విడుదల చేసిన ఒక చిన్న పోస్టర్ లో వర్షపాతం 23 మిల్లీ మీటర్లు నమోదు అయితే, రక్తపాతం ౩౩ మిల్లీమీటర్స్ నమోదు అయ్యాయి అంటూ విడుదల చేసిన ఒక పోస్టర్ సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేసింది.
ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని వచ్చే నెల 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు విడుదల చెయ్యబోతున్నారు . ఈ టీజర్ అభిమానులను ఉర్రూతలూ ఊగించే విధంగా ఉంటుందని, టాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన టీజర్స్ లో ది బెస్ట్ గా ఉండబోతుందని సమాచారం. డైలాగ్స్ కూడా పూనకాలు రప్పించే రేంజ్ లో ఉంటాయట. చూడాలి మరి .
