Pawan Kalyan : ఒకవైపు రాజకీయాలు మరోపక్క మూవీస్ తో తెగ బిజీగా ఉన్న పవర్ స్టార్ కథ కొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బ్రో మూవీ తో ప్రేక్షకులకు ముందు వచ్చిన పవన్ తన అభిమానులకు రేంజ్ ట్రీట్ ఇచ్చారనే చెప్పాలి. కలెక్షన్స్ పరంగా సినిమా ముందుకు దూసుకుపోతోంది అలాగే మరోపక్క వివాదాల్లో కూడా అదే రేంజ్ లో దూసుకుపోతోంది.

అయితే ప్రస్తుతం పవన్ నటిస్తున్న మరి రెండు చిత్రాలు షూటింగ్ పనులు పెండింగ్ ఉన్నాయి. వారాహి ఎక్కి రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ ఇక ఎలక్షన్స్ తర్వాతే షూటింగ్ పనులు మొదలు పెడతాడు అని అందరూ అనుకున్నారు. అయితే రీసెంట్ గా పవన్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గత కొద్ది కాలంగా సరైన హిట్టు పడక మంచి ఆకలి మీద ఉన్న పవన్ కి బ్రో సినిమా కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. రేపు తగ్గకుండా ఉండాలి అంటే వెంటనే ఇంకో సినిమా రిలీజ్ అయిపోవాలి అని భావించిన పవన్ హరీష్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్టు సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.అయితే మూవీకి సంబంధించి పవన్ డైరెక్టర్ కి ముందుగానే ఒక కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.
అదేదో పెద్ద కొత్త విషయం ఏమీ కాదు పవన్ మరియు అతని కాల్ షీట్స్ కాంప్లికేషన్స్. ఈ మూవీకి కేవలం 30 రోజుల కాల్ షీట్స్ మాత్రమే పవన్ ఇవ్వడం జరిగింది. అంటే డైరెక్టర్ 30 రోజుల్లో షూటింగ్ ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి. హరీష్ కూడా ఇక ఎలక్షన్స్ వరకు పవన్ చేతికి చిక్కడు అనే భయంతో ఈ 30 రోజుల సినిమాకి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.