#OG లో దిమ్మ తిరిగే ట్విస్ట్.. ‘గాంధీ’ గా కనిపించబోతున్న పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ ప్లానింగ్ మామూలుగా లేదు!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం #OG. ప్రముఖ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు,. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని చెప్పుకొని తిరిగే సునీత ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని పాత్రలో చూపించబోతున్నాడు.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

గత కొంత కాలం క్రితం రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమా 39 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో విలన్ గ్యాంగ్ మీద ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఎక్సక్లూసివ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. #OG అంటే ఫుల్ ఫార్మ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసిందే, అయితే #OG కి మరో అర్థం కూడా ఉందట.

OG Movie

ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు గాంధీ అట, ‘O’ అంటే ఆయన ఇంటి పేరుతో మొదలయ్యే అక్షరం అని తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ కి అన్నయ్య మరియు వదిన పాత్రలలో కిక్ శ్యామ్ మరియు శ్రీయా రెడ్డి నటిస్తున్నారు. శ్రియా రెడ్డి పాత్ర చాలా రఫ్ గా మరియు పవర్ ఫుల్ గా ఉంటుందట. పవన్ కళ్యాణ్ ఇది వరకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రం చేస్తున్నాడు. ‘భగత్ సింగ్’ అనే ఫ్రీడమ్ ఫైటర్ పేరు అనే విషయం అందరికీ తెలిసిందే.

- Advertisement -
Pawan Kalyan OG Movie

ఇక ఆ తర్వాత తెరకెక్కుతున్న #OG సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ క్యారక్టర్ పేరు ఫ్రీడమ్ ఫైటర్ దే పెట్టుకోవడం విశేషం, ఇలా వరుసగా ఫ్రీడమ్ ఫైటర్ పేర్లతో సినిమాలు తీస్తున్నందుకు ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం లో విలన్ గా బాలీవుడ్ క్రేజీ హీరో ‘ఇమ్రాన్ హష్మీ’ నటిస్తుండగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here