పవర్ స్టార్ Pawan Kalyan మన అందరికీ ఒక అద్భుతమైన ఎంటర్టైనర్ గా, ఒక డైరెక్టర్ గా , ఒక సాంగ్ కొరియోగ్రాఫేర్ గా , ఫైట్ మాస్టర్ గా మరియు సింగర్ గా ఇలా ఎన్నో కోణాల్లో మనకి తెలుసు.పవన్ కళ్యాణ్ అసలు ఇండస్ట్రీ లోకి హీరో అవుదామని రాలేదు, డైరెక్టర్ కావాలని వచ్చాడు.కానీ తన వదిన కారణంగా హీరో అవ్వాల్సి వచ్చిందని ఎన్నో సందర్భాలలో తెలిపాడు.డైరెక్షన్ చెయ్యడం కోసం ఆయన ప్రత్యేకంగా కోచింగ్ కూడా తీసుకున్నాడు.
సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే కేవలం డైరెక్టర్ అవ్వాలనే కోరిక తప్ప, పెద్దగా ఆశలు ఏమి లేని మనిషి.ఆ ఆసక్తే ఆయనని అసిస్టెంట్ డైరెక్టర్ ని చేసిందంటే ఎవరైనా నమ్ముతారా..?,కానీ నమ్మక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి.చిరంజీవి వందవ చిత్రం దర్శకరత్న దాసరినారాయణరావు తో ‘లంకేశ్వరుడు’ అనే సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అప్పట్లో పెద్ద ఫ్లాప్ అయ్యింది.
డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద మొదటి నుండి అమితాసక్తి ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ సమయం లో తరుచూ లొకేషన్స్ కి వస్తుండేవాడట.అయితే అనుకోకుండా దాసరి నారాయణ రావు గారి అసిస్టెంట్ డైరెక్టర్ కి అనారోగ్యం కారణంగా షూటింగ్ కి రాలేని పరిస్థితి ఏర్పడింది అట.వేరే అసిస్టెంట్ డైరెక్టర్ కోసం ఎదురు చూస్తున్న దాసరి కి చిరంజీవి ‘మా కళ్యాణ్ కి డైరెక్షన్ మీద చాలా ఆసక్తి ఉంది..మీకు ఉపయోగపడుతాడు అనుకుంటే వాడిని అసిస్టెంట్ డైరెక్టర్ గా తీసుకోండి..నేను వాడితో మాట్లాడుతాను’ అని చెప్పాడట.దాసరి నారాయణరావు వెంటనే ఓకే చెప్పాడు.అలా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని రోజులు షూటింగ్ చేసాడని తెలుస్తుంది.మా హీరో ముట్టుకొని క్రాఫ్ట్ అంటూ ఏది మిగలలేదు, అన్నీ ట్రై చేసాడు ఒక్క సంగీతం తప్ప అని పవన్ కళ్యాణ్ అభిమానులు మురిసిపోతున్నారు.