పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న చిత్రం #OG. ప్రముఖ దర్శకుడు సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రన్ రాజా రన్ మరియు సాహూ వంటి చిత్రాలను తెరకెక్కించిన సుజిత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఇండస్ట్రీ కి వచ్చిందే పవన్ కళ్యాణ్ కి దర్శకత్వం వహించడానికోసం అని ఎన్నో సందర్బాలలో తెలిపాడు.

నేడు ఆ అవకాశం వచ్చేలోపు ఎక్కడా కూడా తగ్గకుండా కనీవినీ ఎరుగని రేంజ్ లో #OG చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కలకాలం గుర్తుంచుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గానే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ ఫైట్ ని చిత్రీకరించాడు. ఈ షెడ్యూల్ లో తమిళ నటుడు అర్జున్ దాస్ కూడా పాల్గొన్నాడు.

అంతే కాకుండా ఈ చిత్రం క్యాస్టింగ్ విషయం లో కూడా ఎక్కడా రాజీ పడకుండా భారీ గా ప్లాన్ చేస్తున్నాడు సుజిత్. రీసెంట్ గానే అర్జున్ దాస్ మరియు శ్రీయారెడ్డి ని ఈ చిత్రం లోకి తీసుకున్న సుజిత్, ఇప్పుడు ఈ చిత్రం లో మెయిన్ విలన్ గా బాలీవుడ్ క్రేజీ హీరో, అల్ రౌండర్ గా మంచి పేరు తెచ్చుకున్న ‘ఇమ్రాన్ హష్మీ’ నటిస్తున్నట్టుగా కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసారు. ఇమ్రాన్ హష్మీ కేవలం హీరో మాత్రమే కాదు, సింగర్ మరియు మ్యూజిక్ కంపోజర్ కూడా.

ఈయన సినిమాలను మనం చూసి ఉండకపోవచ్చు కానీ, ఒక పాపులర్ పాట ద్వారా మన అందరికీ సుపరిచితమే. ‘ఝలక్ డికలాజ’ అనే సాంగ్ తో ఇండియా ని ఆయన ఒక ఊపు ఊపేసాడు. రీసెంట్ గానే ఈ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ‘సెల్ఫీ’ అనే చిత్రం చేసాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ #OG లో చెయ్యడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.చూడాలి మరి ఇంత క్రేజీ క్యాస్టింగ్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎన్ని అద్భుతాలు సృష్టించబోతుందో అనేది.
