Prashanth Varma ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో పవన్ కళ్యాణ్..? ఆ దేవుడి శక్తులతో మరో సూపర్ హీరో సినిమా!

- Advertisement -

Prashanth Varma చిన్న సినిమాగా ఎన్నో రాజకీయాలకు, కుట్రలకు బలై, థియేటర్స్ విషయం లో పోరాడి, చివరికి తక్కువ థియేటర్స్ తోనే సరిపెట్టుకున్నప్పటికీ, బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సినిమాలకు చుక్కలు చూపించి రికార్డు స్థాయి వస్సూళ్ళు రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న చిత్రం ‘హనుమాన్’. కంటెంట్ ఉన్న సినిమాని ఎవ్వరూ అడ్డుకోలేరు అని చెప్పడానికి నిదర్శనమే ఈ సినిమా.

అతి తక్కువ బడ్జెట్ తో 500 కోట్ల రూపాయిల రేంజ్ క్వాలిటీ పనితనం ని చూపించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ని మెచ్చుకొని తీరాల్సిందే. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రాబొయ్యే రోజుల్లో వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే సూపర్ హీరో సిరీస్ గా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ‘హనుమాన్’ కేవలం ఒక భాగం మాత్రమే.

దీనికి కొనసాగింపుగా మరో 19 సినిమాలు వస్తాయట. రెండవ భాగం ‘జై హనుమాన్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. అయితే ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో స్టార్ హీరోలు కూడా ఎంటర్ అవుతారని టాక్. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక సూపర్ హీరో కథని సిద్ధం చేసుకున్నాడట ప్రశాంత్ వర్మ.

- Advertisement -

హనుమాన్ చిత్రం లో హీరో కి హనుమంతుడి పవర్స్ ఎలా అయితే వస్తాయో, పవన్ కళ్యాణ్ తో తియ్యబోయే సినిమాలో సూపర్ హీరో కి మహా శివుడి పవర్స్ లభిస్తాయట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రశాంత్ వర్మ ఇంకా పవన్ కళ్యాణ్ కి కథ వినిపించలేదని, ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీ గా ఉన్నాడు కాబట్టి, కాస్త ఫ్రీ అయినా తర్వాత అవకాశం ఇస్తే ఈ కథని పవన్ కళ్యాణ్ కి వివరిస్తాడని తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here