ఎవరికైనా సహాయం అవసరం పడింది అంటే , నేనున్నాను అంటూ చెయ్యి అందించే గొప్ప మనసు ఉన్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్నయ్య చిరంజీవి నుండి వారసత్వం గా పవన్ కళ్యాణ్ కి అలవాటు పడిన ఈ లక్షణం, ఎంతో మంది ఆకలిని తీర్చింది, ఎంతో మంది జీవితాలను మార్చేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందే ఆయన ఇలాంటి సహాయాలు ఎన్నో చేసాడు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన సహాయాలు హద్దు అదుపే లేదు.

కొన్ని సందర్భాలలో తన బ్యాంకు అకౌంట్ లో 10 లక్షల రూపాయిలు ఉన్నప్పుడు కూడా సహాయం అవసరం ఉన్న వారికి క్షణ కాలం కూడా ఆలోచించకుండా ఇచ్చేసిన గొప్ప మనసున్న వ్యక్తి ఆయన.ఆయన చేసిన సహాయాల గురించి ఎప్పుడు బయటకి చెప్పుకోడు, ఎదో ఒక సమయం లో అవే బయటపడుతుంటాయి.అలా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ చేసిన ఒక గొప్ప సహాయం గురించి సోషల్ మీడియా లో బయటపడింది.

ఇక అసలు విషయం లోకి వెళ్తే,నిన్న చీపక్ స్టేడియం లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్ లో పంజాబ్ CSK పై గెలిచింది. అది కాసేపు పక్కన పెడితే నిన్న సిక్స్ కి వెళ్తున్న బాల్ ని క్యాచ్ పట్టుకొని అందరిని షాక్ కి గురి చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రషీద్ కి గతం లో పవన్ కళ్యాణ్ సహాయం చేసాడు. రషీద్ చాలా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి, కానీ అతనిలో క్రికెట్ ఆడే గొప్ప ప్రతిభ దాగి ఉంది.

కానీ క్రికెట్ నేర్చుకొని మరో లెవెల్ కి వెళ్లేంత డబ్బు అతని దగ్గర లేదు. పవన్ కళ్యాణ్ వద్దకి వెళ్లి ఈ సమస్య చెప్పుకోగా ఆయన వెంటనే రెండు లక్షల రూపాయిల చెక్ ని రషీద్ కోసం రాసిచ్చాడు, అంతే కాదు భవిష్యత్తులో అతను ఎదగడానికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను అంటూ మాటిచ్చాడు.ఆ రషీద్ గురించే ఈరోజు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. రాబొయ్యే రోజుల్లో ఇతను ఇండియన్ క్రికెట్ టీం తరుపున ఆడి మన జట్టుకి ఎలాంటి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాడో చూడాలి.

