Anchor Anasuya : అనసూయ చేసిన పనికి పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం.. అడ్డంగా ఇరుక్కుందిగా..

- Advertisement -

Anchor Anasuya : టాలీవుడ్ యాక్టర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ, మరోవైపు సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది.. ఈ అమ్మడు ఎప్పుడు ఏదొక వార్తతో వివాదాల్లో చిక్కుకుంటుంది.. నిత్యం వార్తల్లో హైలెట్ అవుతుంది.. మొన్నటివరకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు టార్గెట్ అయిన అనసూయ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు టార్గెట్ అయ్యింది.. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది..

Anchor Anasuya
Anchor Anasuya

అసలేం జరిగిందంటే.. పవన్ కళ్యాణ్ మూవీ అంటే విపరీతమైన రీచ్ ఉంటుంది. చిన్న పాత్ర అయినా చేయడానికి నటులు ఆసక్తి చూపుతారు. అనసూయ మాత్రం ఆయనతో కలిసి డాన్స్ చేసే బంపర్ ఆఫర్ వదులుకుందట.. నేను చెయ్యలేను అని చెప్పడంతో ఆ ఛాన్స్ వేరొకరికి వచ్చిందని టాక్.. పవన్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో ఇట్స్ టైం టూ పార్టీ నౌ అనే సాంగ్ లో ముందుగా అనసూయను అడిగారట.. కానీ అనూ మాత్రం యాంకరింగ్ లో బిజీగా ఉండటంతో ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట… దాంతో ఆ పాట ముంతాజ్ దగ్గరకు వెళ్లింది..

అనసూయ పవన్ కళ్యాణ్ మూవీ ఆఫర్ రిజెక్ట్ చేసిన విషయం తెలిసిన అభిమానులు ఫైర్ అయ్యారు. అనసూయను ట్రోల్ చేశారు. నువ్వు పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోవు. ఆయనతో సినిమా చేయనంటావా? అని ఘాటైన కామెంట్స్ తో చుక్కలు చూపించారు.. ఈ విషయాన్ని స్వయంగా అనసూయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.. రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీలో అనసూయ చేసిన రంగంమ్మత్త పాత్ర మంచి పేరు తెచ్చింది. రంగస్థలం అనంతరం అనసూయకు ఆఫర్స్ పెరిగాయి.. ఇప్పుడు పుష్ప 2 వంటి సినిమాల్లో నటిస్తుంది.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here