Game Changer #RRR వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. #RRR మూవీ షూటింగ్ అయిపోయిన రెండు మూడు రోజులకే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సెట్స్ లోకి అడుగుపెట్టాడు. ఎప్పుడో పూర్తి అవ్వాల్సిన ఈ సినిమా, మధ్యలో శంకర్ ఇండియన్ 2 కి షిఫ్ట్ అవ్వడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. రీసెంట్ గానే విడుదలైన ఇండియన్ 2 చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కమర్షియల్ గా మూడు దశాబ్దాల శంకర్ కెరీర్ లో ఎప్పుడూ కూడా ఫ్లాప్స్ చూడలేదు. కానీ మొట్టమొదటిసారి ‘ఇండియన్ 2’ తో చూడాల్సి వచ్చింది. దీని ప్రభావం కచ్చితంగా గేమ్ చేంజర్ చిత్రం పై పడే అవకాశాలు ఉన్నాయి.

థియేట్రికల్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుతో పోలిస్తే ఇప్పుడు తగ్గే అవకాశాలు ఎక్కువ. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇప్పుడు ఒక శుభ వార్త. నిన్న జరిగిన ధనుష్ ‘రాయన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన ‘గేమ్ చేంజర్’ నిర్మాత అభిమానులకు తమ సినిమాని క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కచ్చితంగా పండగలాంటి వార్తే. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం నిరాశ కలిగించే వార్త. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆగస్టు నెల నుండి ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి డేట్స్ ఇచ్చాడు.
ఈ సినిమాని ఆయన పూర్తి చేస్తే డిసెంబర్ లో విడుదల చెయ్యాలి అనేది నిర్మాత ఏఎం రత్నం ప్లాన్. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ సంస్థతో కుదరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాదే ఆ చిత్రాన్ని విడుదల చెయ్యాలి. లేకపోతే తీసుకున్న డబ్బులను నిర్మాత తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. డిసెంబర్ లో హరి హర వీరమల్లు చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నా కూడా ‘గేమ్ చేంజర్‘ విడుదల తేదీని అదే డిసెంబర్ కి ప్రకటించడంపై పవన్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అదే డిసెంబర్ నెలలో పుష్ప 2 కూడా విడుదల కానుంది. ఇలా మెగా ఫ్యామిలీ సంబంధించిన ముగ్గురు స్టార్ హీరోలు కూడా డిసెంబర్ పై కన్నేశారు. మరి ఎవరు ముందుకు వస్తారు, ఎవరు వెనక్కి వెళ్తారు అనేది చూడాలి.