Pawan Kalyan : మూడో భార్య లెజ్నొవాతో విభేదాలు..పవన్ కళ్యాణ్ విడాకులకు రెడీ అయ్యాడా?

- Advertisement -

Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు.. సినిమాల్లో ఉన్నప్పుడే ఈయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికి తెలుసు..నెంబర్ వన్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో బిజీగా మారాడు. ప్రస్తుతం ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. అయితే రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ను ఎదుర్కోవడానికి ఎన్నో దారులు ఉన్నా.. ప్రత్యర్థులు వాడే ప్రధాన ఆయుధాల్లో ఆయన వివాహాలు ఒకటి..నిజానికి పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు..

Pawan Kalyan
Pawan Kalyan

మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాడు.. అంటూ ప్రత్యర్థి పార్టీలు ఆయన్ను విమర్శిస్తూనే ఉంటాయి. వారి విమర్శలను పవన్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంటాడు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందే విశాఖపట్నం కు చెందిన నందిని అనే అమ్మాయిని మొదటి వివాహం చేసుకున్నారు..ఆమెతో విడిపోయిన తర్వాత బద్రి సినిమా హీరోయిన్ రేణు దేశాయ్ కొన్నాళ్లు సహజీవనం చేసి.. ఆపై పెళ్లి చేసుకున్నాడు. వీరి బంధం కూడా ఎక్కువ కాలం సాగలేదు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రేణు దేశాయ్‌, పవన్ కళ్యాణ్ విడిపోయారు. రేణు దేశాయ్ కు కూడా విడాకులు ఇచ్చిన పవన్ రష్యాకు చెందిన అన్నా లెజ్నెవా ను మూడవ పెళ్లి చేసుకున్నాడు..

lezhneva
lezhneva

వీరి బంధానికి సాక్ష్యంగా ఒక బాబు కూడా వున్నారు. రష్యా అమ్నాయి అయినప్పటికీ భారతీయ సంప్రదాయాన్ని అలవాటు చేసుకుని ఒక హైందవ మహిళ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అన్నా లెజ్నెవా ఉంటారు. అయితే ఇప్పుడు మూడో భార్యతో సైతం పవన్ కు విభేదాలు ఏర్పడ్డాయంటూ గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. అంతేకాదు, మళ్లీ పవన్ విడాకులకు రెడీ అయ్యాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని పవన్ అభిమానులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకులే ఈ రూమర్లను వైరల్ చేస్తున్నారని.. పవన్ దంపతుల మధ్య మాత్రం ఎటువంటి విభెదాలు లేవని అంటున్నారు.. మరీ ఈ వార్తపై పవన్ కళ్యాణ్ ఏమంటారో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here