Pawan Kalyan : స్టార్ హీరోల సినిమా విడుదల ఉందంటే చాలు.. ప్రతీ థియేటర్ దగ్గర హీరోల కట్ ఔట్స్ ప్రత్యక్షమవుతాయి. ఎవరి కట్ ఔట్ పెద్దది అని పోటీ కూడా జరుగుతుంది. అయితే వీటన్నింటికి భిన్నంగా మొదటిసారి ఒక మూవీ టీవీ ప్రీమియర్ కోసం హీరో కట్ ఔట్‌ను ఆవిష్కరించడం ఆశ్చర్యపరుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈమధ్యకాలంలో ఆయన తెరకెక్కించే సినిమాలు సైతం ఆయన ఫ్యాన్స్‌ను సంతోషపెట్టేలాగానే ఉన్నాయి. ఆ సినిమాల్లో ఆయన డైలాగులు.. నేరుగా ఆయన ఫ్యాన్స్‌తో మాట్లాడుతున్నట్టుగానే ఉన్నాయి. దీనికి ఉదాహరణే తాజాగా విడుదలయిన ‘బ్రో’. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్.. దేవుడి పాత్రలో కనిపించారు. ఇక ఆయన చెప్పే డైలాగులకు థియేటర్‌లో ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ మూవీ థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా హిట్ అయ్యింది. ఇప్పుడు బుల్లితెరపైకి రానుంది. ‘బ్రో’ శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు కొనుగోలు చేసింది. త్వరలోనే ఈ మూవీ జీ తెలుగులో ప్రీమియర్ కానుంది.

అయితే మునుపెన్నడూ లేని విధంగా జీ తెలుగు ఒక కొత్త ప్లాన్ వేసింది. ‘బ్రో’ ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 54 అడుగుల కట్ ఔట్‌ను ఆవిష్కరించనుంది. అయితే ఈ ఆవిష్కరణ వేడుకకు అందరూ ఆహ్వానితులే అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్‌లో ఉన్నారు. ఒక సినిమా టీవీ ప్రీమియర్ కోసం ఒక ఛానెల్.. ఇలాంటి ఈవెంట్‌ను ప్లాన్ చేయడం కొత్తగా ఉంది అంటూ మూవీ లవర్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.