Pawan Kalyan : లోపల ఎన్ని ఉన్నా పైకి మాత్రం మెగా బ్రదర్స్ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. ఇకపోతే పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన తల్లిదండ్రుల తర్వాత ఆయనే తనను తండ్రిలా పెంచారని పవన్ ఎప్పుడు అన్న చిరంజీవి గురించి చెబుతుంటాడు. పవన్ చిన్నప్పటి నుంచి చాలా రిజర్వడ్ గా పెరిగాడు. ఎవరితోనూ కలవడు.. చదువు కూడా అంతంత మాత్రమే. ఇదంతా పవన్ చాలా వేదికలపై చెప్పాడు. కానీ అన్నను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం ఊరుకునేవాడు కాదట. దీనికి సంబంధించిన ఓ కథనం ఇప్పుడు వైరల్గా మారింది. చెన్నైలో చిరంజీవి షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు రౌడీలు అక్కడికి వచ్చి చిరును ఎగతాళి చేసేవారు. షూటింగ్ జరగకుండా వాచ్ మెన్ ను తిట్టడం, కొట్టడం చేసేవారట.
అన్నింటినీ చిరంజీవి సైలంట్ గా భరించి ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ కానిచ్చారట. అయితే ఆ రౌడీలు మరీ మితిమీరి ప్రవర్తిస్తుంటే.. చిరంజీవి కారు డ్రైవర్.. పోలీసులకు ఫిర్యాదు చేద్దాం సార్ అని సలహా ఇచ్చాడట. దానికి చిరంజీవి.. ఏం వద్దు ఇంకో రెండు గంటలు భరిస్తే షూటింగ్ పూర్తవుతుంది. ఇలాంటి గొడవలేం వద్దని నచ్చజెప్పాడట. అయితే చిరును రౌడీలు అనరాని మాటలు అన్నారని తెలుసుకున్న పవన్ కల్యాణ్ వెంటనే ఆ రౌడీలు ఉన్న ప్లేస్ కు వెళ్లి వాళ్లను చితక్కొట్టాడట. ఈ విషయం తెలుసుకున్న చిరు.. కళ్యాణ్ ను మందలించాడట. దీంతో ఉదయమే.. కళ్యాణ్.. రౌడీలు అడ్మిట్ అయిన హాస్పిటల్ కు వెళ్లి.. వారికి సారీ చెప్పి వచ్చాడట. అన్నను తిట్టారని 18 ఏళ్లకే రౌడీలతో పోరాడట పవన్ కల్యాణ్ . అన్న అంటే అంత పిచ్చి ప్రేమ పవన్ కల్యాణ్ కు. ఇదే విషయాన్నీ పవన్ జనసేన సభలో కూడా తెలిపాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.