పవిత్ర లోకేష్ పై ప్రశంసలు.. నిజంగా గ్రేట్ అంటున్నారు.. ఎందుకో తెలుసా..

- Advertisement -

నటి పవిత్ర లోకేష్ పరిచయం అవసరం లేని పేరు.టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా భారీగా ట్రెండ్ అవుతున్నటువంటి ఈమె తాజాగా నటుడు నరేష్ తో కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లేటు వయసులో వీరిద్దరూ ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలోనే మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ గా నిలిచారు.

పవిత్ర లోకేష్
పవిత్ర లోకేష్

ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది.ఇలా ఈ సినిమా ద్వారా నరేష్ పవిత్ర లోకేష్ మరింత పాపులారిటీ సంపాదించుకున్నారని చెప్పాలి. ఈ సినిమా అనంతరం ఈమెకు పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తుంది. ఇలా పవిత్ర లోకేష్ కెరియర్ పట్ల ఎంతో బిజీగా మారబోతున్నారని తెలుస్తోంది. అయితే పవిత్ర లోకేష్ కెరియర్ గురించి పక్కన పెడితే ఈమె తాజాగా తీసుకున్నటువంటి ఓ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈ విషయం లో ఆమె చాలా గ్రేట్ అంటూ తనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారటా.ఇలా అంత గొప్ప పని పవిత్ర లోకేష్ ఏం చేసింది అనే విషయానికి వస్తే..ఈమె తన మాతృభాష అయినటువంటి కన్నడ సాహిత్యం లో పిహెచ్ డీ చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే పీహెచ్డీ ప్రవేశ పరీక్ష రాయడం కోసం ఏమి తాజాగా బళ్లారి వెళ్లారని తెలుస్తుంది. హంపి కన్నడ యూనివర్సిటీ లో ఈమె పీహెచ్డీ ప్రవేశ పరీక్ష రాసిందని తెలుస్తుంది.. అయితే పవిత్రను స్వయంగా నరేష్ దగ్గరుండి ఈ పరీక్ష రాయడానికి తీసుకువెళ్లి ఆమె చేత ఈ పరీక్ష రాయించారని సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here