నరేష్‌ లేకపోతే సూసైడ్‌ చేసుకునేదాన్ని : పవిత్రా లోకేష్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

- Advertisement -

నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. పవిత్రా లోకేశ్‌ కథానాయిక. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఈ కుటుంబ కథా చిత్రానికి ఎం.ఎస్‌.రాజు దర్శకత్వం వహించారు. మే 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలను పవిత్రా లోకేశ్‌ తాజాగా మీడియాతో మట్లాడింది. నరేష్‌ తకెంతో ప్రత్యేకమైన వ్యక్తని తెలిపింది.

పవిత్రా లోకేష్‌
పవిత్రా లోకేష్‌

నటిగా కెరీర్‌ మొదలుపెట్టిన నాటి నుంచి మంచి పాత్రలు మాత్రమే చేయాలనుకున్నా. హీరోయిన్‌గానే సినిమాలు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కెరీర్‌ ఆరంభంలోనే సుప్రసిద్ధ దర్శకులు గిరీశ్‌ కాసరవెల్లి దర్శకత్వంలో హీరోయిన్‌గా రెండు సినిమాలు చేశాను. అది నా అదృష్టం. ఆ తర్వాత నాకు నచ్చిన పాత్రలను చేస్తూ ఇక్కడి వరకూ వచ్చాను. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించానని సంతోషం వ్యక్తం చేసింది. నా దృష్టిలో బయోపిక్‌ అనేది చాలా పెద్ద పదం. కాబట్టి ‘మళ్ళీ పెళ్లి’ బయోపిక్‌ కాదు. ఇది కేవలం నేటి సమాజానికి అద్దం పట్టే సినిమా మాత్రమే. ప్రేక్షకులు తప్పకుండా దీనికి కనెక్ట్‌ అవుతారు.

ఇక నరేష్‌ నా జీవితంలోకి వచ్చాక ఎన్నో మార్పులు వచ్చాయి. ఆయన ఎంత సరదాగా ఉంటారో నటనపై అంత నిడద్ధతతో ఉంటారు. నాకు కష్ట సమయాల్లో ఎంతో అండగా ఉన్నారు. ఆయన లేకపోతే సూసైడ్‌ చేసుకునేదాన్నేమో. ఎంత సీరియస్ విషయాన్నయినా ఆయన చాలా లైట్ తీసుకుంటారు. అలాగే సీరియస్‌గా దానికి బదులిస్తారు.

- Advertisement -

ఆ లక్షణం నాలో లేదు. చిన్న విషయాలనూ నేను సీరియస్‌గా తీసుకుంటాను. ఇక, ఆయన ప్రస్తుతం గురించే ఆలోచిస్తారు. ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలనుకుంటారు. రేపు అనేది వచ్చాక చూసుకుందామంటారు. ఈ విషయాన్ని ఆయన నుంచే నేర్చుకున్నాను. అంతేకాకుండా, ఆయన నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దీనికంటే కావాల్సింది ఏముంది.

అలాగే సమాజం మా గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటుంది. కేవలం ఇదొక్కటే కాదు సమాజంలో ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. అయితే సమాజంలో ఎవరి ఆలోచన, అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. మా విషయంలో కొన్ని సంఘటనలు జరిగాయి.

ముఖ్యంగా నా విషయానికే వస్తే .. కొందరు పరిస్థితులని అడ్డుపెట్టుకొని నన్ను తప్పుగా చూపించారు. నా వ్యక్తిత్వానికి హాని కలిగించి, నా కెరీర్‌పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూశారు. అలాంటి పరిస్థితి నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఒంటరిగా ఉండుంటే ఆత్మహత్య లేదా ఇంట్లో కూర్చోవాల్సి వచ్చేది. ఆ పరిస్థితి నుంచి బయటికి వచ్చానంటే కారణం నరేశ్‌. ఆయనే నాకు అండగా నిలబడ్డారు. నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here