మాది అక్రమ సంబంధం కాదు.. పబ్లిక్ గా చెప్పిన పవిత్రా లోకేష్

- Advertisement -

నరేష్ చాలా బోల్డ్. ఈ మధ్య కాలంలో ఆయన చర్యలు చూస్తే ఇది అర్థం అవుతుంది. గతంలో నరేష్ మీద ఉన్న అభిప్రాయం వేరు. గత ఏడాది కాలంగా ఏర్పడిన అభిప్రాయం వేరు. నరేష్ పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడని 2022లో బయటపడింది. కానీ గత నాలుగేళ్లుగా వీరు కలిసే ఉంటున్నారు. కేవలం సన్నిహిత వర్గాలకు మాత్రమే ఈ విషయం తెలుసు. పవిత్ర లోకేష్ ని నరేష్ పెళ్లి చేసుకోలేదు. ఆ విషయం ఆయన స్వయంగా చెప్పాడు. కానీ భార్యకు ఏమాత్రం తక్కువ కాదు. చెప్పాలంటే అంతకంటే ఎక్కువే.

పవిత్రా లోకేష్
పవిత్రా లోకేష్

తాజాగా ఈ ఇద్దరు కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలకు ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను, పెళ్లి వీడియోను షేర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా పవిత్ర లోకేష్ మీడియాతో ముచ్చటించారు. అందులో మాట్లాడుతూ..‘‘నేను నరేష్ ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. మేమిద్దరం 24 గంటలు పక్కపక్కనే ఉంటాం అలాంటప్పుడు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. అదేం తప్పు కాదు.

naresh and pavitra lokesh

ఇక అక్రమ సంబంధం అనే పదాన్ని వాడకూడదని ఇప్పటికి చట్టం కూడా చెప్పింది. అయినా చాలామంది మా పవిత్రబంధాన్ని అలా రాస్తున్నారు. మాది అక్రమసంబంధం కాదు. మాపై వచ్చే ట్రోల్స్ చూసి చాలా బాధ వేస్తుంది. కానీ ఎవరో ఏదో అంటే పట్టించుకోవడం ఎందుకని వదిలేస్తున్నాం. నేను జీవితంలో చాలా కష్టాలు అనుభవించాను. నరేష్ నాకు కష్టకాలంలో తోడుగా నిలిచాడు’’ అని చెప్పింది. మళ్ళీ పెళ్లి మూవీ మే 26న విడుదల కానుంది. తెలుగు, కన్నడలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here