తమిళనాట సంచలనంగా మారిన ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్ విషయం.. అసలు ఏం జరిగిందంటే ?

- Advertisement -

2008 లో తమిళ లో రిలీజ్ అయిన “వాళండిల్‌ కాల్తేనే” అనే తమిళ సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది నటి సునయన. తమిళ లో వరుస సినిమాల్లో నటిస్తూ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే అని చెప్పాలి. ‘కుమారి వర్సెస్ కుమారి’ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన సునయన.. “రాజ రాజ చోర” మూవీతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఇటీవల విశాల్‌కు జోడీగా ‘లాఠీ’ మువీలో మెరిసిన ఈ కోలీవుడ్ ​బ్యూటీ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ భామను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ట్విట్టర్‌ సహా ఇతర సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో ఎక్కడా కనిపించడం లేదని.. ఆమె ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ వస్తుందని ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాంతో సునయన మిస్సింగ్‌, కిడ్నాప్‌ అంటూ వార్తలు వచ్చాయి. ఆమె ఫ్యాన్స్‌ సునయనకు ఏం జరిగిందో తెలియక కంగారు పడుతున్నారు. ఈ వార్త కాస్త పోలీసుల దృష్టికి చేరడంతో.. వారు సునయన కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

నటి సునయన
నటి సునయన

ఎగ్మూర్‌ నుంగంబాక్కం, కోయంబేడు, విరుగంబాక్కం ప్రాంతాల్లో సునయన సంచరించిందన్న సమాచారం తెలియడంతో.. ఆ ప్రాంతాలకు వెళ్లి ఆమె కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. తర్వాత వలసరవకలోని ఆమె ఇంటిని.. ఆమె నటిస్తున్న సినిమా నిర్మాణ సంస్థలను కూడా ఆరా తీశారు. అంతేకాక గత రెండు రోజులుగా ఆమె ఎక్కడ తిరిగిందన్న విషయాలను సేకరించే పనిలో ఉన్నారు. అయితే ఈ మేరకు సునయన కోసం వెతుకుతున్న పోలీసులకు ఓ షాకింగ్‌ న్యూస్‌ తెలియడంతో అందరూ ఇప్పుడు షాక్ కి గురవుతున్నారు.

- Advertisement -

సునయన కిడ్నాప్ అయ్యిందంటూ వచ్చిన వీడియో అంతా ఓ డ్రామా అని.. అమె నటించిన లేటెస్ట్ మువీ ప్రమోషన్స్‌లో భాగాంగా ఓ వీడియోను అప్‌లోడ్‌ చేశామని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. దీంతో పోలీసులతో పాటు అభిమానులు కూడా ఏం అనాలో తెలియని అయోమయంలో మిగిలిపోయారు. ఆ వీడియోను చూసి నిజమేనని నమ్మిన కొందరు నెటిజన్లు రెస్క్యూ సునైనా అనే హ్యాష్‌ట్యాగ్‌ కూడా పోస్ట్ లు పెట్టిన వారంతా ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ కోసం మరీ ఇంత చేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సునయన ఎయిరా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న “రెజీనా” అనే మూవీలో నటిస్తుంది. దాదాపు 4 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే సినిమా రిలీజ్‌ ఉండగా ఆ ప్రమోషన్స్ లో భాగంగా ఇలా చేసినట్లు తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here