Vaishnav Tej : మన ఇండియా లో సినిమాలకు అత్యంత గౌరవ ప్రాయంగా భావించే అవార్డ్స్ ‘నేషనల్ అవార్డ్స్’. ఇప్పటి వరకు ఈ అవార్డ్స్ లో బాలీవుడ్ మరియు మాలీవుడ్ సినిమాలు ఎక్కువగా తమ హవా చూపించేవి. కానీ మొట్టమొదటిసారి మన తెలుగు సినిమా నేషనల్ అవార్డ్స్ ని క్లీన్ స్వీప్ చేసింది. ఏకంగా పది క్యాటగిరీస్ లో అవార్డ్స్ ని కవిసం చేసుకొని చరిత్ర సృష్టించింది.
ఇక అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా మొట్టమొదటి అవార్డు ని అందుకున్న ఏకైక స్టార్ హీరో గా సరికొత్త చరిత్ర ని సృష్టించాడు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన అల్లు అర్జున్ గురించే చర్చ. మన టాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటుగా వివిధ రాష్ట్రాలకు చెందిన స్టార్ హీరోలు , లెజండరీ దర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. కానీ అల్లు అర్జున్ తో పాటుగా మరో మెగా హీరో చరిత్ర సృష్టించాడు, అతనే పంజా వైష్ణవ్ తేజ్.
ఇతను హీరో గా నటించిన మొదటి సినిమా ‘ఉప్పెన’ కి బెస్ట్ తెలుగు ఫిలిం గా నేషనల్ అవార్డు దక్కింది. ఇక ఆయన హీరో గా ప్రముఖ దర్శకుడు జాగర్లమోడీ రాధాకృష్ణ అలియాస్ క్రిష్ తెరకెక్కించిన రెండవ చిత్రం ‘కొండపొలం’ చిత్రానికి బెస్ట్ లిరిక్ రైటర్ జాబితా లో చంద్రబోస్ కి నేషనల్ అవార్డు దక్కింది. ఇలా టాలీవుడ్ లో ఒకేసారి రెండు జాతీయ అవార్డ్స్ దక్కించుకున్న సినిమాల్లో పంజా వైష్ణవ్ తేజ్ నటించడం ఆయన అదృష్టం అనే చెప్పాలి.
నిన్న అందరూ అల్లు అర్జున్ మీద ఎక్కువ గా ఫోకస్ చెయ్యడం వల్ల పంజా వైష్ణవ్ తేజ్ వెలుగులోకి రాలేదు కానీ, మొదటి రెండు చిత్రాలకు నేషనల్ అవార్డ్స్ ని దక్కించుకున్న ఏకైక హీరో గా వైష్ణవ్ తేజ్ చరిత్ర సృష్టించాడు. దీనిని బట్టీ అర్థం అయ్యింది ఏమిటంటే వైష్ణవ్ తేజ్ కథల ఎంపిక అదిరిపోయిందనే. ఇదే ఊపులో ఆయన కెరీర్ ని కొనసాగిస్తే కచ్చితంగా పెద్ద స్టార్ అవుతాడు.