Pallavi Prashanth – Gautham : ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ పర్వం ఒక రేంజ్ లో సాగింది. కంటెస్టెంట్స్ అందరూ ఎవరికీ వారు తమ కారణాలతో నామినేషన్స్ చేస్తూ వాదనలు చేసుకున్నారు. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ కి అగ్ని పరీక్ష లాంటిది. ఎందుకంటే గత వారం ఎలిమినేషన్ లేదు, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. కెప్టెన్ అయిన కామరణంగా ప్రియాంక ని ఎవరూ నామినేట్ చెయ్యలేదు.

అలాగే శోభా శెట్టి ని కూడా ఈసారి ఎందుకో ఎవ్వరూ నామినేట్ చెయ్యలేదు. ఇదంతా పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ మరియు గౌతమ్ మధ్య నిన్న నామినేషన్స్ చాలా వాడివేడి వాతావరణం లో కొనసాగింది. సంచాలక్ గా ఫెయిల్ అయ్యినందుకు నామినేట్ చేస్తున్నాను అని పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేస్తాడు గౌతమ్. బాణం టాస్క్ లో యావర్ అంత సేపు చేతిలో పెట్టుకున్నా కూడా అతన్ని క్వాలిఫై చేసావు అనేది గౌతమ్ పాయింట్.

ఇద్దరు సంచాలక్స్ ఉన్నప్పుడు నేనే నీకు కనిపించానా, సేఫ్ గేమ్ ఆడుతున్నావ్ అంటూ పల్లవి ప్రశాంత్ గౌతమ్ ని అంటాడు. అప్పుడు గౌతమ్ నేను సేఫ్ గేమ్ ఎప్పుడూ ఆడను, ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ ని అయినా నామినేట్ చేస్తా, ఇప్పుడు నాకు ఆరు మంది మీద నామినేషన్స్ వెయ్యాలని ఉంది, బిగ్ బాస్ అనుమతి ఇస్తే వేసేస్తా,నీలాగా కేవలం కొంతమందిని మాత్రమే నామినేట్ చెయ్యకుండా నేను ఉండను అంటూ కామెంట్స్ చేస్తాడు.

అలా వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతూ తార స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు పల్లవి ప్రశాంత్ నీ పంచె ఊసిపోకుండా చూసుకో అని గౌతమ్ ని అంటాడు. అప్పుడు గౌతమ్ నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోను, పంచె అనేది తెలుగు వాడి సంప్రదాయం, దానిని అవమానిస్తావా నువ్వు అని అంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ చాలా వ్యక్తిగతం అయ్యింది. దీనిపై నాగార్జున వీకెండ్ లో ఎలా రెస్పాన్స్ ఇస్తాడో చూడాలి.