Bigg Boss : ఈ వారం ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ బిగ్ బాస్ హౌస్ లో ఎంత ఎమోషన్స్ మధ్య కొనసాగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రతీ నిమిషానికి పాయింట్స్ పట్టిక మారిపోతూ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే ఉత్కంఠ నడుమ చాలా ఆసక్తి కరంగా టాస్కులు జరిగాయి. ఈ టాస్కులలో అమర్ దీప్, అర్జున్ మరియు పల్లవి ప్రశాంత్ అద్భుతంగా ఆడి తమ సత్తా చాటారు.

కానీ అమర్ దీప్ ఓడిపోయిన వాళ్ళ దగ్గర పాయింట్స్ ఆశించి, వాళ్ళను అడుక్కోవడం వల్ల పల్లవి ప్రశాంత్ మరియు అర్జున్ మాత్రమే ఆడినట్టు అందరికీ అనిపించింది, అమర్ దీప్ ఆట మొత్తం అడుక్కోవడమే అని కూడా అనిపించింది. ఆడియన్స్ కూడా పల్లవి ప్రశాంత్ మరియు అర్జున్ లలో ఎవరికో ఒకరికి వస్తే బాగుంటుంది. వాళ్ళిద్దరితో అర్జున్ కి రావాలి, ఎందుకంటే ఎవరి దగ్గర పాయింట్స్ తీసుకోకుండా తన సొంతం గా ఆడాడు అనే సానుభూతి అందరిలో కలిగింది.

ఈరోజు ఈ ముగ్గురి మీద మూడు టాస్కులు జరిగాయి. అందులో మొదటి టాస్క్ ఫజిల్ టాస్క్. ఈ టాస్కులో ఫజిల్ లో బాల్స్ వెయ్యాలి. ఇందులో అర్జున్ గెలవగా, పల్లవి ప్రశాంత్ రెండవ స్థానం లో, అలాగే అమర్ దీప్ మూడవ స్థానం లో నిలుస్తాడు. ఇక రెండవది జెండాల టాస్క్, ఇందులో కూడా అర్జున్ గెలవగా, పల్లవి ప్రశాంత్ మూడవ స్థానం లో నిలిచి ఎలిమినేట్ అవ్వగా, అమర్ దీప్ రెండవ స్థానం లో నిలుస్తాడు.

పాయింట్స్ తక్కువ ఉండడం వల్ల ప్రశాంత్ రేస్ నుండి ఎలిమినేట్ అవుతాడు. ఇక చివరికి అమర్ మరియు అర్జున్ మధ్య జరిగిన బీభత్సమైన పోరు లో అర్జున్ ‘టికెట్ టు ఫినాలే’ ఫైనల్ అస్త్ర ని గెలుచుకొని, ఫైనల్స్ కి వెళ్ళిపోయాడు. అందరూ కోరుకున్న విధంగానే అర్జున్ గెలిచాడు,అమర్ దీప్ ఓడిపోయాడు. ఈ ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.
