Pallavi Prashanth : ఈ సీజన్ బిగ్ బాస్ ఎపిసోడ్స్ లో ఈ వారం ప్రేక్షకులను బాగా ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఫ్యామిలీ వీకెండ్ అవ్వడం , హౌస్ లోకి వచ్చిన ప్రతీ ఒక్కరు ఎమోషనల్ గా ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవ్వడం వంటివి ఈ సీజన్ కి మెయిన్ హైలైట్ గా నిల్చింది. ముఖ్యంగా శివాజీ, అమర్ దీప్ , గౌతమ్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

ఇవన్నీ ఒక ఎత్తు, నేడు పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్ మరో ఎత్తు. ఒక సామాన్య రైతు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే రేంజ్ కి ఎదగడం అనేది సాధారణమైన విషయం కాదు. అడుగుపెట్టడమే కాకుండా, పెద్ద పులి లాగ తోటి కంటెస్టెంట్స్ పై విరుచుకుపడి అద్భుతంగా ఆడడం , బిగ్ బాస్ టైటిల్ ని గెలిచే రేంజ్ ఇమేజి ని సొంతం చేసుకోవడం, ఇవన్నీ సామాన్యులకు ఎంతో ఆదర్శప్రాయం అని చెప్పొచ్చు.

ఇక నేడు బిగ్ బాస్ హౌస్ లోకి పల్లవి ప్రశాంత్ తండ్రి ఎంటర్ అవ్వడం, అతన్ని చూసిన వెంటనే ప్రశాంత్ ఎమోషనల్ అవ్వడం, ఇలాంటి సంఘటనలు ప్రేక్షకుల మనసుల్ని హత్తుకున్నాయి. ఆ తండ్రి కళ్ళలో కొడుకు ఇంత ఎత్తుకు ఎదిగాడు అనే ఆనందాన్ని మనం చూడొచ్చు. కేవలం ప్రోమోతోనే కన్నీళ్లు రప్పించేసారు. ఇక ఫుల్ ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి ప్రశాంత్ సపోర్ట్ గా ఉంటూ వచ్చిన వ్యక్తి శివాజీ. శివాజీ ని చూడగానే పల్లవి ప్రశాంత్ తండ్రి చాలా సంతోషం అయ్యా, నా బిడ్డని ఇక్కడ కన్న తండ్రి లాగ చూసుకుంటున్నారు అని అంటాడు. అలాగే అమర్ దీప్ తో ఇద్దరు ఎక్కువగా గొడవ పడకండి అయ్యా అని అంటాడు. చూస్తూ ఉంటే ఈరోజు జరగబొయ్యే ఎపిసోడ్, ఈ సీజన్ లోనే ది బెస్ట్ గా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి.