Pallavi Prashanth : రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి టైటిల్ విన్నర్ గా బయటకి వచ్చి కోట్లాది మంది యువతకి ఆదర్శంగా నిల్చిన పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన రెండు రోజుల్లోనే ఇన్ని రోజులు తన ముఖానికి వేసుకున్న మాస్కుని తొలగించేసాడు. అతని మాటల్లోని పొగరు, బలుపు తత్త్వం తో వ్యవహరిస్తున్న తీరు ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేస్తుంది.

ఇన్ని రోజులు మనం బిగ్ బాస్ హౌస్ లో చూసిన వినయ విధేయ ప్రశాంత్ ఇతనేనా?, మొదటి వారం నుండి శివాజీ అనే వ్యక్తి పక్కన లెకపొయ్యుంటే అతని మాస్క్ తొలగి ఉండేదా?, అమర్ దీప్ చెప్పినట్టుగానే ఇతనికి రెండు ముఖాలు మరియు రెండు నాలుకలు ఉన్నాయా అని జనాలు ఇప్పుడు అనుకుంటున్నారు. తనని ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చిన యాంకర్స్ పట్ల అమర్యాదగా వ్యవహరిసు పల్లవి ప్రశాంత్ మాట్లాడిన కొన్ని మాటలు చూస్తే ఇతనికా మనం ఇన్ని రోజులు ఓట్లు వేసి గెలిపించింది అని అనిపిస్తాది.

అసలు విషయానికి వస్తే ప్రముఖ యూట్యూబర్ శివ సెలబ్రిటీస్ తో మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో ఇంటర్వ్యూస్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అలా వచ్చిన పాపులారిటీ తోనే ఆయన బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో ఒక కంటెస్టెంట్ గా వచ్చి టాప్ 3 వరకు వెళ్ళాడు. నిన్న ఆయన పల్లవి ప్రశాంత్ ని ఇంటర్వ్యూ చెయ్యడానికి ప్రశాంత్ ఇంటికి వెళ్ళాడు.

కానీ ఇంటికి వెళ్లిన తర్వాత ప్రశాంత్ వ్యవహరించిన తీరుని యాంకర్ శివ చాలా తప్పు పట్టాడు. ఇంటర్వ్యూ ఇస్తానని రా అన్నా అని ఇంటికి పిలిచి, 18 గంటలు వెయిట్ చేయించి , మళ్ళీ ఇంటి బయట ఒక 8 గంటలు వెయిట్ చేయించి చివరికి ఇంటర్వ్యూ ఇవ్వను దెం**య్ అని అన్నాడట. ఈ విషయాన్నీ యాంకర్ శివ తన ఇంస్టాగ్రామ్ లో చెప్పుకొచ్చాడు. దీని మీద అతి త్వరలోనే వీడియో విడుదల చేస్తాను అని కూడా చెప్పుకొచ్చాడు. హౌస్ నుండి బయటకి వచ్చిన రెండు రోజుల్లోనే ప్రశాంత్ వేషాలను చూసి ఓట్లు వేసిన ఆడియన్స్ నోరెళ్లబెడుతున్నారు.
