Big Boss : రతిక వల్ల నాకు శని పట్టుకుందన్న పల్లవి ప్రశాంత్.. వీళ్ల ప్రేమ కథకు ముగింపు పడ్డట్లేనా..

- Advertisement -

Big Boss : బిగ్ బాస్ సీజన్ 7లో జరిగిన నాలుగో వారం నామినేషన్స్‌ జరుగుతున్నాయి. పల్లవి ప్రశాంత్, రతిక.. బిగ్ బాస్‌లోకి ఎంటర్ అవ్వగానే మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కానీ మెల్లగా వీరిద్దరి మధ్య అనేక మనస్పర్థలు వచ్చాయి. అసలు ఈ ఇద్దరు ఎప్పుడు మంచిగా మాట్లాడుకుంటున్నారో.. ఎప్పుడు గొడవపడుతున్నారో.. చూసే ప్రేక్షకులకు మాత్రమే కాదు.. కంటెస్టెంట్స్‌కు కూడా అర్థం కాలేదు. తాజాగా నామినేషన్స్ పూర్తయిన తర్వాత కూడా వీరిద్దరికి వాగ్వాదం జరిగింది.

Big Boss
Big Boss

తాజాగా జరిగిన నామినేషన్స్‌లో ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు అమర్‌దీప్. అప్పుడు తనకు సంబంధం లేకపోయినా మధ్యలో మాట్లాడి ప్రశాంత్‌కు రెండు మొహాలు ఉన్నాయి అని నిరూపించడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత ప్రశాంత్.. గౌతమ్‌ను నామినేట్ చేస్తున్న సమయంలో కూడా రతిక జోక్యం చేసుకొని గొడవను పూర్తిగా తనవైపుకు తిప్పుకుంది. రతిక డ్రెస్సింగ్ గురించి ముందుగా గొడవ మొదలయ్యింది. నోటికి వచ్చినట్టు మాట్లాడకు అంటూ ప్రశాంత్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది రతిక. ఈ గొడవ మధ్యలోకి ఇతర కంటెస్టెంట్స్ కూడా వచ్చారు.

‘‘సారీ చెప్పాడని బాగుంటే ఏయ్, ఓయ్ అంటాడు. అతను ఎవరో నాకు బయట కూడా తెలియదు.’’ అంటూ సందీప్‌తో చెప్పడం మొదలుపెట్టింది రతిక. అప్పుడే ప్రశాంత్ కూడా అక్కడికి వచ్చాడు. తను ఎవరినైనా అలాగే పిలుస్తానంటూ సమర్ధించుకున్నాడు ప్రశాంత్. ‘‘నిన్ను కూడా ఏయ్ అన్న అంటాను కదా’’ అని సందీప్‌ను ప్రశ్నించాడు. ‘‘నిన్ను వేరు నేనొక అమ్మాయిని. రతిక అనమను. లేదా అక్క, చెల్లి అనమను’’ అంటూ సందీప్‌తో చెప్పింది రతిక. ‘‘చెల్లి అనే పిలుస్తా రేపటినుండి’’ అన్నాడు ప్రశాంత్. ‘‘అదంతా వద్దు నాకొక పేరుంది’’ అని రతిక చెప్తుండగానే.. ‘‘నాకు ఇదంతా వద్దు. రతిక అని కూడా నేను అనను. అక్కా అనే అంటా’’ అని ప్రశాంత్ గట్టిగా చెప్పేశాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here