Pallavi Prashanth : నాలుగో పవర్ అస్త్రా కోసం ముగ్గురు కంటెండర్స్‌గా ఎంపికయ్యారు. వారే శుభశ్రీ, యావర్, పల్లవి ప్రశాంత్. ఇప్పటివరకు జరిగిన పవర్ అస్త్రా పోటీల్లో కంటెండర్స్‌ను వెనక్కి లాగడానికి, వారు ఓడిపోయేలా చేయడానికి మిగిలిన కంటెస్టెంట్స్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈసారి బిగ్ బాస్ స్వయంగా కంటెండర్స్‌ను డిస్టర్బ్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. దీంతో రతిక, అమర్‌దీప్ రంగంలోకి దిగారు.

ముఖ్యంగా పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్ చేస్తూ వారు చేసిన వ్యాఖ్యలు కాస్త శృతిమించినట్టుగా ఉన్నాయని ప్రేక్షకులు సైతం భావిస్తున్నారు. కాసేపు యావర్‌ను, శుభశ్రీని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించిన అమర్‌దీప్, రతిక.. తిరిగి పల్లవి ప్రశాంత్ వైపే వచ్చారు. అక్క అని ఎందుకు అన్నావంటూ పదే పదే అదే ప్రశ్న అడిగాడు అమర్. ‘‘అది వాడి ఇష్టం’’ అని సమాధానమిచ్చాడు శివాజీ. దానికి అమర్, రతిక ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. సంచాలకులు మాట్లాడకూడదు అని గట్టిగా చెప్పారు. ఆ తర్వాత ప్రశాంత్‌ను ఉద్దేశిస్తూ..

‘‘ఆయన బుర్రలో మన్ను, మశానం ఉంది. అందుకే ప్రతీ వారం రిలేషన్స్ మార్చేస్తాడు’’ అని నవ్వుతూ చెప్పింది రతిక. ‘‘నీ మాట మీద నీకు క్లారిటీ ఉండదా. సిగ్గు లేదా నీకు. ఇలాగేనా నిన్ను పెంచింది ఇంట్లో. బుద్ధుందా ఒక అమ్మాయితో ఇలాగేనా ప్రవర్తించేది. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట నీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తావా. నోట్లో నుండి మాట వచ్చేటప్పుడు ఆలోచించి మాట్లాడు. మజాక్ కూడా ఏం లేదు. మీసాలు, గడ్డాలు ఉన్నా వేస్టే.’’ అని ప్రశాంత్‌ను ఉద్దేశిస్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడింది రతిక.