OTT Platforms : కరోనా మహమ్మారి విలయతాండవం ఆడుతున్న రోజుల్లో బాగా ఎఫెక్ట్ అయినా రంగాలలో ఒకటి సినీ రంగం. థియేటర్స్ కి జనాలు రావడానికి బాగా భయపడ్డారు. కొన్ని నెలల వరకు ఈ ప్రభావం చాలా బలంగా పడింది. ఆ సమయం లో ఓటీటీ కి అలవాటు పడిన జనాలు థియేటర్స్ కి రావడం మానేశారు. ఆ సమయం లో డిజిటల్ మీడియా పార్టనర్స్ పెద్ద పెద్ద నిర్మాతలకు ఫ్యాన్సీ ప్రైజ్ తో సినిమాలు కొనడం ప్రారంభించారు. ఒకపక్క నిర్మాతకి మరోపక్క డిజిటల్ మీడియా పార్టనర్స్ కి లాభాల పంట కురిసింది.
ఒకానొక సమయం లో డిజిటల్ స్త్రీమింగ్స్ కారణంగా థియేట్రికల్ రన్ పై ఘోరమైన ప్రభావం పడింది. అప్పుడు నిర్మాతలు మొత్తం చర్చలు జరిపి థియేటర్స్ లో ఒక సినిమా విడుదలైన తర్వాత కనీసం 30 రోజుల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ ఇవ్వరాదని తీర్మానించుకున్నారు. దీంతో నిర్మాతలకు థియేట్రికల్ రన్ కలిసి వచ్చింది, అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్స్ కి కూడా ఎలాంటి నష్టం వచ్చింది లేదు.
కానీ రీసెంట్ సమయం లో మాత్రం అమెజాన్ ప్రైమ్ , నెట్ ఫ్లిక్స్ వంటి భారీ ఓటీటీ డిజిటల్ స్ట్రెమ్మింగ్స్ నెట్వర్క్స్ లో నష్టాలు వాటిల్లయట. ఈ ఏడాది అయితే అనుకున్న బడ్జెట్ లిమిట్ కూడా దాటిపోయింది అట. అంతే కాకుండా డబ్బులు అత్యధికంగా వెచ్చించిన సినిమాలు నష్టాలను మిగిల్చాయట. దీంతో ఈ ఏడాది నుండి సినిమాలను కొన్ని రోజులు కొనకూడదు అని నిర్ణయం తీసుకున్నాయట.
ఈ ప్రభావం ఇప్పుడు రవితేజ – గోపీచంద్ మలినేని సినిమా మీద పడి, ఆ చిత్రం ఆగిపోయింది. కారణం 120 కోట్లు బడ్జెట్, ఓటీటీ సంస్థలు ఈ సినిమాని కొనేందుకు సిద్ధంగా లేకపోవడం వల్లే. భవిష్యత్తులో ఓటీటీ ప్రభావం హీరోల రెమ్యూనరేషన్స్ మీద పడబోతోంది అని చెప్పొచ్చు. ఓటీటీ రైట్స్ వల్ల భారీ లాభాలు వస్తున్నాయి కాబట్టి హీరోలు అడిగినంత రెమ్యూనరేషన్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం దాదాపుగా పొయ్యినట్టే అని చెప్పాలి.