NTR ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న ఆస్కార్ వేడుక ఈరోజు ఘనంగా జరిగింది..ఈసారన్న మనదేశానికి తెలుగుకు ఒక్క ఆస్కార్ అన్నా రాదా అని ఎదురు చూసిన భారతీయుల కోరిక ఇప్పటికి తీరింది. సినిమాలకు సంబంధించి ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారాలుగా చెప్పుకునే ‘ఆస్కార్’ వేడుక వైభవంగా సాగింది. హాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఈ సంవత్సరం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కూడా ఈ గ్రాండ్ ఈవెంట్లో సందడి చేసింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగిన ఈ వేడుకల్లో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రం ఏకంగా ఏడు పురస్కారాలను అందుకుని విజయకేతనం ఎగురవేసింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి అవార్డులు ఆ మూవీనే వరించాయి. ఈసారి ఆస్కార్స్‌లో భారత జెండా రెపరెపలాడింది.
మన దేశానికి రెండు పురస్కారాలు దక్కాయి. ఇండియా నుంచి నామినేట్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డును అందుకుంది..బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీ నుంచి ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డును సొంతం చేసుకుంది..కేవలం అవార్డులు మాత్రమే కాదు ఎన్టీఆర్ వేసుకున్న డ్రెస్సు కూడా అందరిని ఆకట్టుకుంది..ముఖ్యంగా ఆయన ధరించిన డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దానిపై ఉన్న పులి బొమ్మ గురించి ఆస్కార్ వేడుకలో ఓ రిపోర్టర్ తారక్‌ను అడిగారు. దీనికి ఆయన తనదైన శైలిలో స్పందించారు.
భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తాను ఈ వస్త్రధారణలో వచ్చానన్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో తనతో కలసి దూకిన పులి ఇదేనంటూ సరదాగా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. ఇక అందరికి తెలియని విషయం ఒకటి ఉంది.. ఆ డ్రెస్సు ధర.. ఆ డ్రెస్సు ధర తో ఒక పెళ్లి చెయ్యొచ్చు అని అభిమానులు అంటున్నారు.. దీన్ని ధర ఏడు వందల రూబీస్ విలువ కలిగి ఉంటుంది.. మన ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే లక్షలు అనే చెప్తున్నారు.. బంగారం తో స్పెషల్ గా చేయించిన డ్రెస్సు కావడంతో అంత ధర ఉంటుందని అంచనా.. ప్రస్తుతం డ్రెస్సు ధర సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..