భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆదిపురుష్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాఘవుడిగా, కృతిసనన్ జానకిగా నటించిన ఈ సినిమాను తానాజీ ఫేం ఓం రౌత్ తెరకెక్కించారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దగ్గరనుంచి ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. రిలీజైన తర్వాత కూడా ఈ సినిమా పై విమర్శలు తగ్గడం లేదు. దాదాపు 500కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. జూన్ 16న విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. ఆదిపురుష్ సినిమాను సరిగా తీయలేదని పలువురు విమర్శిస్తున్నారు. రామానంద్ సాగర్ రామాయణంతో పోల్చుతూ వివాదాలు రేపుతున్నారు. ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా సినిమా రూ.450కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు, రావణుడి పాత్రలను చిత్రీకరించడంలో డైరెక్టర్ ఓంరౌత్ ఎన్నో తప్పులు చేశారంటూ ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ప్రభాస్ మళ్లీ ఓం రౌత్ ని నమ్మి మరో సినిమాలో భాగం కానున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఫ్యాన్స్ మళ్లీ కాంబినేషన్ వద్దు బాబోయ్ అంటున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ప్రభాస్ పేరును పెంట పెంట చేసేసాడు . మరో ఛాన్స్ ఇస్తే ఈసారి నట్టింట్లో ముంచడం ఖాయం అంటూ ట్రోల్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. చూడాలి మరి ప్రభాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..? ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రభాస్ మరోసారి ఓం రౌత్ తో కలిస్తే తన గోతి తాను తీసుకున్నట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు కూడా.
