Rishab Shetty : శాండిల్‌వుడ్‌లో రిషబ్ శెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న తాను కాంతార 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు స్టార్ స్టేటస్, లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న రిషబ్ శెట్టి.. గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని తాజాగా వివరించాడు. ఇంతకీ రిషబ్ శెట్టి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలుసుకుందాం. సినిమాల్లోకి రాకముందు చాలా కష్టాలు పడ్డానని.. ఎన్నో ఉద్యోగాలు చేశానని.. తల్లిదండ్రుల ముందు ఎప్పుడూ చేయి చాచలేదంటూ రిషబ్ శెట్టి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రిషబ్ శెట్టి మాట్లాడుతూ మొదట ఇండస్ట్రీలో క్లర్క్ బాయ్‌గా పనిచేశాను, ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానంటూ చెప్పుకొచ్చాడు.
నటుడిగా మారాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాకు అసలు ఎవరిని సంప్రదించాలో, ఎలా సంప్రదించాలో తెలియడం లేదని రిషబ్ శెట్టి అన్నారు. ఓ కన్నడ నటుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి హీరో ఎలా అయ్యాడో చదివి కొంచెం నేర్చుకున్నానన్నారు. రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. యాక్టింగ్‌పై ఉన్న ఆసక్తితో ఫిల్మ్ మేకింగ్ గురించి కొద్దికాలం కోచింగ్ ఇచ్చాను. డిగ్రీ చదివే సమయంలో డబ్బులు లేక కూలి పనులకు వెళ్లేవాడినని, తన మొదటి సినిమాకు దర్శకత్వం వహించే వరకు వాటర్ క్యాన్లు అమ్మడం, రియల్ ఎస్టేట్, హోటళ్లలో పనిచేయడం వంటి ఎన్నో కష్టతరమైన పనులు చేశానని వ్యాఖ్యానించారు. చదువుకునే సమయంలో సినిమాల్లో ఆఫర్లు రావాలని ప్రయత్నించినా అవి వర్కవుట్ కాలేదన్నాడు.
తుగ్లక్ అనే సినిమాలో నేను మొదట నటించాను అని వివరించారు. ఆయన దర్శకత్వం వహించిన రిక్కీ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకోవడం విశేషం. మరి ఆయన దర్శకత్వంలో వచ్చిన కిర్రాక్ పార్టీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. మొదట కూలీగా ఎన్నో కష్టాలు పడి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు శాండల్ వుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు రిషబ్ శెట్టి. రిషబ్ శెట్టికి శాండల్ వుడ్ లోనే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో డబ్ అయ్యాక ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచిన కాంతారతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.