మన టాలీవుడ్ లో ఒక హీరో చేసిన సినిమాలను మరో హీరో నచ్చడం, మెచ్చుకోవడం అనేది తరచూ జరుగుతూనే ఉంటుంది. ఆనాటి సీనియర్ ఎన్టీఆర్ కాలం నుండి నేటి పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు కాలం వరకు, ఇది తరచూ జరుగుతూ వస్తున్నా ప్రక్రియ. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన తోటి స్టార్ హీరోల సినిమాలతో పాటుగా, చిన్న సినిమాలను కూడా చూస్తూ వాటి గురించి ట్విట్టర్ లో గొప్పగా మాట్లాడడం ఇది వరకు మనం ఎన్నోసార్లు చూసాము.

జూనియర్ ఎన్టీఆర్ కూడా పలు సినిమాలకు ఇలాంటి రివ్యూస్ ఇచ్చాడు. అంతే కాదు తమ కుటుంబం తో దశాబ్దాల నుండి ఉన్న బాక్స్ ఆఫీస్ రైవలరీ ని కూడా పక్కన పెట్టి చిరంజీవి కుటుంబానికి చెందిన రామ్ చరణ్ తో కలిసి #RRR వంటి మల్టిస్టార్రర్ చిత్రం చేసాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలను సృష్టించిందో అందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ సమయం లోనే ఎన్టీఆర్ ని ఒక విలేఖరి ప్రశ్న అడుగుతూ మీకు చిరంజీవి గారి సినిమాల్లో బాగా ఇష్టమైనది ఏమిటి అని అడగగా ఎన్టీఆర్ దానికి సమాధానం చెప్తూ ‘చిన్నప్పుడు నేను తాత గారి సినిమాలు మాత్రమే కాదు, అందరి హీరోల సినిమాలను చూసేవాడిని. అప్పట్లో చిరంజీవి గారి రుద్రవీణ సినిమాలోని పాటలు నాకు బాగా నచ్చింది, ఈ సినిమాకి ఎలా అయినా వెళ్లాలని అనుకున్నాను.
విడుదలైన మొదటి రోజే థియేటర్ కి వెళ్ళిపోయాను, అక్కడ క్యూ లైన్ లో నిల్చున్నప్పుడు పోలీసుల చేత కొన్ని దెబ్బలు కూడా పడ్డాయి. అలా ఆ సినిమాని చూసాను, చాలా అద్భుతంగా అనిపించింది. అప్పటి వరకు చిరంజీవి గారి కమర్షియల్ సినిమాలు చూస్తూ పెరిగిన మాకు, ఆయనలోని నటుడిని అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రం ఈ సినిమా నాకు అనిపించింది’ అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
