NTR : ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ పూర్తిగా మారిపోయింది.. ఇంటర్నెషనల్ స్టార్ అయ్యాడు.. ఆస్కార్ అందుకున్న ఆయన ఈరోజు తిరిగి హైదరాబాద్ కు వచ్చేశాడు. లాస్ ఏంజిల్స్ నుంచి ఈ ఉదయం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు.. రాత్రి నుంచే ఎన్టీఆర్ వస్తాడని అభిమానులు అక్కడ ఉన్నారంటే మామూలు విషయం కాదు..అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. RRR సినిమాలోని నాటు నాటు పాటకు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో… ఆస్కార్ అవార్డ్ దక్కిన విషయం మనకు తెలుసు.

ఈ సందర్భంగా.. అభిమానులు, రిపోర్టర్లూ… తారక్‌ను ఎయిర్‌పోర్టులో కలిశారు. ఎంఎం కీరవాణి, చంద్రబోస్‌లు ఆస్కార్ అవార్డును స్వీకరించడం బెస్ట్ మూమెంట్. నేను RRR గురించి చాలా గర్వంగా భావిస్తున్నాను. ఆర్‌ఆర్‌ఆర్‌ని ప్రోత్సహించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..ఆస్కార్ కన్నా ముందు మీ ప్రేమను పొందాను నాకు అదే చాలు అని ఎన్టీఆర్ అనడంతో అభిమానులు కేకలు ఇలలు వేస్తూ ఎన్టీఆర్ నినాదాలు చేశారు.. మరోవైపు నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ కూడా హైదరాబాద్ విచ్చేశారు. ఆయన కూడా ఆస్కార్ రావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.
ఈ పాట కోసం తాను 2 నెలల పాటూ కష్టపడ్డాను అని తెలిపారు. తాను కంపోజ్ చేసిన స్టెప్స్‌ని ఆస్కార్ వేదికపై వేయడం ఎంతో ఆనందం కలిగిందని తెలిపారు. ఈ పాట కోసం రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారన్న ప్రేమ్ రక్షిత్… రాజమౌళితో పనిచేయడం అనేది ఒక్క మాటలో చెప్పలేను అలా జరుగుతూ వస్తుంది.. ఈ పాటకు ఆస్కార్ రావడం పై యావత్ సినీ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఎన్టీఆర్, మెగా అభిమానుల సంతోషానికి అవధుల్లేవు.. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు..