Nivetha Pethuraj : బ్యాంగ్స్ తో నివేదా న్యూ లుక్.. లుక్ అదిరిందంటూ నెటిజన్ల కామెంట్స్

- Advertisement -

Nivetha Pethuraj : నివేదా పేతురాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమైన పేరు. హీరోయిన్లంటే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అని భావించే రోజుల్లోనే.. ఈ భామ వెండితెరపైకి అరంగేట్రం చేసింది. సినిమాల్లో ఎంట్రీకి ఇచ్చినప్పటి నుంచి వైవిధ్యమైన పాత్రలనే ఎంచుకుంటోంది.  ఓవైపు గ్లామర్ గా కనిపిస్తూనే మరోవైపు నటనలో తన సత్తా చూపుతోంది.

ఈ భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ అభిమానుల కోసం తన ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది నివేదా పేతురా. సినిమాల్లో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Actress Nivetha Pethuraj
Actress Nivetha Pethuraj

తాజాగా నివేదా పేతురాజ్ షేర్ చేసిన ఫొటోల్లో న్యూ లుక్ లో కనిపించింది. హెయిర్ బ్యాంగ్స్ తో నివేదా న్యూ లుక్ అదిరిపోయింది. ఈ లుక్ లో నివేదా సూపర్ కూల్ గా కనిపిస్తోంది. ఈ బ్యూటీ న్యూ లుక్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇక రెడ్ కలర్ సల్వార్ కమీజ్ లో నివేదా చాలా స్టైలిష్ గా అనిపించింది.

- Advertisement -
Nivetha Pethuraj Photos
Nivetha Pethuraj Photos

దాస్ కా ధమ్కీ సినిమా ట్రైలర్ లాంఛ్ లో నివేదా సందడి చేసింది. ఈ ఈవెంట్ లో రెడ్ కలర్ డ్రెస్సులో అదిరిపోయింది. చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తూ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ బ్యూటీ తన అందంతో అందరి మనసు దోచేసింది. 

Nivetha Pethuraj

‘మెంటల్ మది’లో సినిమాతో  తెలుగుతెరకు పరిచయమైంది నివేదా పేతురాజ్. ఈ సినిమా బాగానే అలరించిన ఈ అమ్మడుకు మాత్రం తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. తమిళ డబ్బింగ్ సినిమా టిక్..టిక్..టిక్..లో నివేదా నటించిన, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత పలు టాలీవుడ్ సినిమాల్లో నటించి తన సత్తా చాటింది. తాజాగా నివేదా విశ్వక్ సేన్ ధమ్కీలో నటిస్తోంది. ఆమె గతంలో ఆయన హీరోగా వచ్చిన పాగల్ సినిమాలోనూ నటించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here