NTR : మన టాలీవుడ్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి స్నేహితుల సంఖ్య చాలా ఎక్కువే. మన తోటి స్నేహితులు ఎలా అయితే కనిపిస్తారో,ప్రభాస్ కూడా మనలాగానే చాలా సాధారణంగా కనిపిస్తాడు. ఆయన్ని చూస్తే మన స్నేహితులే గుర్తుకు వస్తారు. ఇక ఇండస్ట్రీ లో కూడా ప్రభాస్ కి మంచి స్నేహితులు ఉన్నారు. వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. ఇద్దరి మధ్య ‘అరేయ్’ అని పిలుచుకునేంత చనువు ఉంది.

ఎన్టీఆర్ తో ప్రభాస్ స్నేహం నిన్న మొన్న పుట్టింది కాదు, ప్రభాస్ సినిమాల్లోకి అడుగుపెట్టకముందు నుండే ఎన్టీఆర్ తో స్నేహం ఉంది. కీలకమైన విషయాల్లో ఒకరి మాట ఒకరు వింటారు కూడా. అయితే ప్రభాస్ ఒక సినిమా విషయం లో వద్దు అని చెప్తున్నా కూడా లెక్క చెయ్యకుండా చేసినందుకు ఎన్టీఆర్ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్నాడు. ఆ సినిమాకి 40 కోట్ల రూపాయిల నష్టం కూడా వాటిల్లింది.

ఆ సినిమా మరేదో కాదు, రామయ్య వస్తావయ్యా. పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని తీసిన హరీష్ శంకర్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో తీస్తున్నాడు అని చెప్పిన రోజుల్లో ఈ సినిమా మీద అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు. కానీ ఈ చిత్రం కథ ఎన్టీఆర్ కంటే ముందు ప్రభాస్ వద్దకి వచ్చిందట. కథ వినగానే, మొన్ననే రెబెల్ చేశాను, ఇలాంటి కథనే అది కూడా, నాకు వర్కౌట్ అవ్వదు, వేరే కథతో రా చేద్దాం అని అన్నాడట ప్రభాస్.

ఆ తర్వాత ఎన్టీఆర్ కి ఈ కథని వినిపించగానే వెంటనే అతను ఓకే చేసాడట. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ వెంటనే ఎన్టీఆర్ కి ఫోన్ చేసి, అనవసరంగా ఆ సినిమా ఒప్పుకున్నావ్, అది వర్కౌట్ అవ్వదు, రిజెక్ట్ చెయ్యి అన్నాడట. కానీ ఎన్టీఆర్ అప్పటికే డైరెక్టర్, నిర్మాతకి కమిట్మెంట్ ఇచ్చేసానని, చెయ్యక తప్పదని ప్రభాస్ తో చెప్పాడట. అలా ప్రభాస్ మాట విననందుకు ఎన్టీఆర్ కి భారీ డిజాస్టర్ ఫ్లాప్ దక్కింది.
