#RRR వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో ‘దేవర’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమధ్యనే షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ చిత్రం అప్పుడే నాలుగు భారీ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుందట.కమర్షియల్ సినిమాకి పాన్ ఇండియా రేంజ్ హంగులు అద్ది , హాలీవుడ్ టెక్నిషియన్స్ ని కూడా ఈ సినిమా కోసం వాడుతున్నాడు కొరటాల శివ.
ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రీకాంత్ మరియు ప్రకాష్ రాజ్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్ తర్వాత, ఆ సినిమాకి చేసిన తప్పులను సవరించుకొని, ఎంతో సమయం తీసుకొని మరీ కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడు. కచ్చితంగా ఈ చిత్రం కొడితే కుంభస్థలం బద్దలు అవుతుంది అనే నమ్మకం తోనే ఉన్నాడు కొరటాల శివ.
ఈ సినిమా లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా కోసం కొరటాల శివ ‘అర్రి అలెక్సా LF’ అనే కెమెరా ని ఉపయోగిస్తున్నారు. ఈ కెమెరా ప్రపంచం లోనే అత్యంత ఖరీదైనది అట. సుమారుగా 82 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా, ఈ కెమెరా తోనే #RRR చిత్రాన్ని షూట్ చేసారు.ఎన్టీఆర్ సోలో హీరో గా నటించిన ‘అరవింద సామెత’ మూవీ కలెక్షన్స్ దాదాపుగా 87 కోట్ల రూపాయిలు అనే సంగతి అందరికీ తెలిసిందే. దాదాపుగా ఆ సినిమా వసూళ్ల రేంజ్ ధర ఉన్న కెమెరా ని వాడుతున్నారు అంటే, ఈ చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
అలాగే ఇప్పటి వరకు ఈ కెమెరా ని ‘జాన్ విక్ 4’, ‘ది బ్యాట్ మ్యాన్’, ‘జోకర్’, ‘యాంట్ మ్యాన్’, ‘స్ట్రేంజర్ థింగ్స్’, ‘డ్యూన్’ మరియు ‘టెర్మినేటర్’ వంటి సినిమాలను తెరకెక్కించారు. ఈ కెమెరా తో షూట్ చేసిన అండర్ వాటర్ సన్నివేశాలు, సినిమాకి మెయిన్ హైలైట్ అవ్వబోతుందట. కొరటాల శివ ఎంతో లాజిక్ తో ఆ సన్నివేశాలను తెరకెక్కించాడని, కచ్చితంగా అభిమానులకు ఒక సరికొత్త అనుభూతిని ఈ సన్నివేశాలు కలిగిస్తాయని అంటున్నారు.