NTR30 నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ – కొరటాల శివ ప్రాజెక్ట్ నేడు పట్టాలెక్కింది.#RRR సినిమా తర్వాత ఏడాదికి పైగా ఖాళీగా ఉంటూ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్ లోకి అడుగుపెట్టడం ఇదే.ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా కొన్ని అనుకోని సంఘటనలు తరుచూ చోటు చేసుకోవడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది.మొత్తానికి కోట్లాది మంది నందమూరి అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ నేడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలను ప్రారంభించుకుంది.

ఆచార్య వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది.ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తో ఎలా అయినా ఈసారి భారీ హిట్టు కొట్టాలనే ఫైర్ తో ఈ కథని తయారు చేసాడు కొరటాల శివ.అందుకోసం ఆయన సుమారుగా ఏడాది సమయం తీసుకున్నాడు.కొరటాల శివ ఈమధ్య కాలం లో ఒక స్క్రిప్ట్ కోసం ఇంత కష్టపడడం చూడడం ఇదే తొలిసారి.

దీనితో కథ వేరే లెవెల్ లో వచ్చి ఉంటుందని అభిమానులు ఆశించారు.కానీ నేడు కొరటాల శివ ఈ సినిమా స్టోరీ లైన్ చెప్పడం తో కాస్త భయపడుతున్నారు ఫ్యాన్స్.ఎందుకంటే అది రొటీన్ స్టోరీ, ఇది వరకు అలాంటి బ్యాక్ డ్రాప్ తో వందల సినిమాలు వచ్చాయి.స్టోరీ విషయానికి వస్తే ఎవరికీ భయపడకండా, ఇష్టమొచ్చినట్టు అక్రమాలు చేస్తూ క్రూర మృగాలకంటే దారుణంగా వ్యవహరించే మనుషులు కేవలం ఒక వ్యక్తిని చూసి భయపడతారు,అతనే మన ఎన్టీఆర్.

ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన మొదటి సినిమా నుండి ఇదే కథతో ముందుకు పోతూ ఉన్నాడు.ఇప్పుడు మళ్ళీ అదే బ్యాక్ డ్రాప్ లో సినిమా తీస్తే ఆడియన్స్ రొటీన్ గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది.పైగా ఈమధ్య ఎంటర్టైన్మెంట్ ఉన్న చిత్రాలు బాగా ఆడుతున్నాయి కానీ, ఇలా సింగల్ సైడ్ వయొలెన్స్ ఉన్న సినిమాలకు లాంగ్ రన్ రావడం లేదు.ఎంత వసూళ్లను రాబట్టిన తొలి మూడు రోజుల్లోనే రాబట్టాలి, ఆ తర్వాత కష్టం అని ఫ్యాన్స్ తో పాటుగా విశ్లేషకుల అభిప్రాయం కూడా.మరి కొరటాల శివ ఈ సబ్జెక్టుని ఎలా డీల్ చేస్తాడో చూడాలి.
