Devara Fear Song : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన బాణీలు అందించాడు. ఆయన సంగీతంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ లెవల్లో అంచనాలు పెట్టేసుకున్నారు. మే 17న రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్తోనే వెన్నులో వణుకు పుట్టించేశాడు అనిరుధ్.

‘దేవర’ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ని ఆదివారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులోని ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ పై ఈ పాటను రూపొందించారు. తారక్ మాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు కొరటాల శివ అద్భుతంగా ఈ పాటను మలిచారు. మాస్ ప్రేక్షకులకు కమ్మిటి విందుభోజనం లాంటి సినిమాగా ‘దేవర’ తెరకెక్కుతుందని ఈ పాట చూస్తే అర్థమవుతుంది. ‘అగ్గంటుకుంది సంద్రం.. ఆ గుండె మండే ఆకసం.. అరాచకాలు భగ్నం.. చల్లారే చెడు సాహసం..’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, అనిరుథ్ రవిచంద్రన్ ఆలపించారు.
దయ లేని దేవర మౌనం.. సవరణ లేని హెచ్చరిక అంటూ ఈ పాటలో కొరటాల మార్క్ ని చూపించారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ సముద్రంలో బోట్ పై అలా వస్తుంటే రెండు కళ్లు చాలవన్నట్లుగా స్టన్నింగ్ లుక్స్ అదిరిపోయాయి. ఇక అనిరుధ్ తన బీజీఎంతో, తన స్వరంతో వణుకించారు. ఇక ఈ సాంగ్ తో రజినీకాంత్ జైలర్ హుకుమ్ సాంగ్ పేరు మీదున్న రికార్డ్ బ్రేక్ చేయడం పక్కా అని తేలిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా ఫియర్ సాంగ్ చూసేయండి.