Bigg Boss : ఈ వారాం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ఏ స్థాయిలో జరిగాయో మన అందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున గొడవలు కూడా జరిగాయి. నామినేషన్స్ లోకి వచ్చిన ఇంటి సభ్యులలో అందరికంటే అత్యధిక ఓట్లను దక్కించుకున్న కంటెస్టెంట్ గా అమర్ దీప్ నిలవగా, అందరి కంటే అతి తక్కువ ఓట్లను దక్కించుకున్న కంటెస్టెంట్ గా శోభా శెట్టి నిల్చింది. ఆమె తర్వాత రతికా మరియు అశ్విని కి తక్కువ ఓట్లు వచ్చాయి.

ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఈ సీజన్ మొత్తం ‘ఉల్టా పల్టా’ అనే విషయం అందరికీ తెలిసిందే. భారీ సస్పెన్స్ ని మైంటైన్ చేసి ఈ వారం నో ఎలిమినేషన్ అని నాగార్జున అధికారికంగా ప్రకటించాడు. కానీ వచ్చే వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని ప్రత్యేకించి చెప్పుకొచ్చాడు నాగార్జున.

అయితే వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే, నామినేషన్స్ లోకి అశ్వినీ, శోభా శెట్టి మరియు రతికా వస్తే మాత్రం ఈ ముగ్గురిలో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పొచ్చు. అయితే ఎందుకో బిగ్ బాస్ యాజమాన్యం శోభా శెట్టి ని కాపాడుతూ వస్తున్నట్టుగా అందరికీ అనిపించింది. కాబట్టి వచ్చే వారం కూడా ఆమె సేవ్ అవ్వొచ్చు. ఆమె బదులు అశ్వినీ మరియు రతికా నామినేషన్స్ లో ఉంటే వీళ్లిద్దరు ఎలిమినేట్ అవ్వొచ్చు.

వీళ్ళిద్దరూ కాకుండా గౌతమ్ మరియు అర్జున్ లాంటి కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి పొరపాటున వస్తే, వాళ్లిద్దరూ ఎలిమినేట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇదంతా ఒక్క ఎత్తు అయితే యావర్ వెనక్కి ఇచ్చేసిన ‘ఏవిక్షన్ పాస్’ నుండి కూడా పెద్ద షాక్ ఎదురు అవ్వొచ్చు. కాబట్టి వచ్చే వారం గేమ్ చాలా ఆసక్తి కరంగా ఉండబోతుంది. ముఖ్యంగా నామినేషన్స్ ప్రక్రియ ఇన్ని వారాలు వేరు, వచ్చే వారం వేరు అని చెప్పొచ్చు.
