Prince Yawar దగ్గర ఉన్న ‘ఏవిక్షన్ పాస్’..ఆ కంటెస్టెంట్స్ కి యమ పాశం లాగ మారనుందా? వీకెండ్ లో మరో ‘ఉల్టా పల్టా’!

- Advertisement -

Prince Yawar : ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో ఏవిక్షన్ ఫ్రీ పాస్ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే, దీని వల్ల ఉన్న ఉపయోగాలు కూడా అందరికీ తెలుసు. ఎవరైతే ఈ పాస్ ని గెలుచుకుంటారో వారు నామినేషన్స్ లో డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు ఈ పాస్ ని ఉపయోగించి బయటపడొచ్చు. అలాగే ఎవరైతే తమకి ఇష్టం ఉన్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉంటారో వారిని ఈ పాస్ ఉపయోగించి బయటపడేయొచ్చు.

Prince Yawar
Prince Yawar

ఇన్ని రోజులు ఏవిక్షన్ ఫ్రీ పాస్ అంటే ఇదే. కానీ ప్రస్తుతం నడుస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 7 లో ఏవిక్షన్ ఫ్రీ పాస్ కాదు, ఏవిక్షన్ పాస్ ని ప్రవేశ పెట్టాడు బిగ్ బాస్. ఇది గెలుచుకున్న కంటెస్టెంట్ చేతిలో యమ పాశం ఉన్నట్టే. ఈ యమ పాశాన్ని యావర్ గెలుచుకున్నాడు. ఈ పాస్ ఆయనేమి నిజాయితీగా గెలవలేదు. ఫౌల్ గేమ్ ఆడి గెలిచాడు.

Ashwin rathika

దీని గురించి సోషల్ మీడియా లో వీడియోస్ తో సహా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే, ఈ ఏవిక్షన్ పాస్ ఒకరిని సేఫ్ చెయ్యడం కోసమో, లేదా తనను తానూ రక్షించుకోవడం కోసమో ఉపయోగించుకునేది కాదు. ఈ పాస్ ని ఉపయోగించి సదరు కంటెస్టెంట్ కి ఇష్టం లేని కంటెస్టెంట్ ని బయటకి పంపడం కోసం ఉపయోగిస్తారట. ఈ వారం నామినేషన్స్ లో అందరి కంటే అతి తక్కువ ఓట్లు దక్కించుకున్న చివరి ఇద్దరి కంటెస్టెంట్స్ లో ఎవరినో ఒకరిని బయటకి పంపే అవకాశం ఉంటుంది.

- Advertisement -
Shoba

అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ వారం అతి తక్కువ ఓట్లను దక్కించుకున్న చివరి ఇద్దరి కంటెస్టెంట్స్ రతికా మరియు అశ్విని. ఈ ఇద్దరూ కూడా యావర్ కి మంచి స్నేహితులు. మరి ఈ పాస్ తో ఆయన ఎవరిని బయటకి పంపుతాడు, ఎవరిని సేవ్ చేస్తాడు అనేది రేపటి ఎపిసోడ్ లో తెలియనుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here